Kitchenvantalu

Aratikaya Bajji:”అరటికాయ బజ్జి” ఈ టిప్స్ తో వేస్తే అచ్ఛం బండి మీద బజ్జి టేస్ట్ వస్తుంది

Aratikaya Bajji:”అరటికాయ బజ్జి” ఈ టిప్స్ తో వేస్తే అచ్ఛం బండి మీద బజ్జి టేస్ట్ వస్తుంది.. కూర అరటికాయలను చాలా మంది సహజంగా ఇష్టపడతారు. వీటితో కూర, పులుసు లేదా వేపుడు చేస్తుంటారు. ఏ విధంగా తయారు చేసినా అరటికాయలు రుచికరంగానే ఉంటాయి.

అయితే, వీటితో బజ్జీలు కూడా తయారు చేసి తినవచ్చు, ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే సులభంగా ఈ బజ్జీలను తయారు చేయవచ్చు. ఇప్పుడు అరటికాయ బజ్జీల తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

అరటికాయ బజ్జీల తయారీకి కావలసిన పదార్థాలు:
కూర అరటికాయలు – 2
శనగపిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 కప్పులు
కారం పొడి – 1 టీస్పూన్
ఇంగువ – చిటికెడు
వాము – కొద్దిగా
నూనె – వేయించడానికి తగినంత
ఉప్పు – తగినంత
besan
తయారీ విధానం:
అరటికాయల కొనలను కత్తిరించి, చెక్కు తీసి, పొడవైన ముక్కలుగా కోయాలి.ఈ ముక్కలను నీటిలో వేసి కొంతసేపు నానబెట్టాలి.ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కారం పొడి, పసుపు, వాము, ఇంగువ, తగినంత ఉప్పు వేసి, కొంత నీరు పోసి మోస్తరు జారుగా కలపాలి.

నీటిలో నానబెట్టిన అరటి ముక్కలను తీసి, ఎండు గుడ్డతో పొడిగా తుడవాలి.ఒక పాన్‌లో నూనె పోసి, బాగా కాగిన తర్వాత, అరటి ముక్కలను ఒక్కొక్కటిగా పిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి వేయించాలి.బంగారు రంగులోకి మారిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

ఈ అరటికాయ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా పల్లి చట్నీతో కలిపి ఆస్వాదించవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."