Kitchenvantalu

Sprouts Vada:ఆరోగ్యానికెంతో మేలు చేసే మొలకలతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ “మొలకల వడ”

Sprouts Vada:ఆరోగ్యానికెంతో మేలు చేసే మొలకలతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ “మొలకల వడ”.. మొలకలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి, షుగర్ మరియు బీపీని అదుపులో ఉంచుతాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు అనేక పోషకాలను అందిస్తాయి.
sprouts benefits
అందుకే రోజూ ఆహారంలో మొలకలను చేర్చుకోవడం చాలా మంచిది. అయితే, మొలకలను నేరుగా తినలేని వారు వీటితో వడలను తయారు చేసుకొని తింటే రుచికరంగా ఉండడమే కాకుండా, పోషకాలు కూడా అందుతాయి. ఇప్పుడు మొలకలతో వడలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మొలకల వడల తయారీకి కావలసిన పదార్థాలు:
పెసలు, బొబ్బర్లు, శనగలు – ఒక్కోటి ఒక కప్పు
ఉప్పు, నూనె, కారం, పసుపు – తగినంత
కొత్తిమీర – పావు కప్పు
కరివేపాకు – పావు కప్పు
chickpeas-sprouts benefits
మొలకల వడల తయారీ విధానం:
ముందుగా పెసలు, బొబ్బర్లు, శనగలను శుభ్రంగా కడిగి నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి.తరువాత వాటిని నీటి నుండి తీసి మళ్లీ శుభ్రంగా కడగాలి, ఆపై ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల మొలకలకు వాసన రాదు.కాస్త పొడిగా అయిన తరువాత, వాటిని శుభ్రమైన గుడ్డలో చుట్టి మూటలా కట్టాలి. ఈ మూటపై కొద్దిగా నీళ్లు చల్లి, ఎండ తగలని చల్లని ప్రదేశంలో ఉంచాలి.

24 గంటల తరువాత మొలకలు బాగా వస్తాయి. అప్పుడు వాటిని తీసి ఉపయోగించాలి.మొలకలలో తగినంత ఉప్పు, కారం, పసుపు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు జోడించి, వడలకు సరిపడేలా గట్టిగా పిండిని తయారు చేయాలి. పిండి మరీ వదులుగా ఉండకూడదు.పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత, పిండి నుండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల ఆకారంలో చేత్తో వత్తాలి.ఈ వడలను నూనెలో వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.వేగిన తరువాత వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

ఇలా తయారైన మొలకల వడలు రుచికరంగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా పల్లీలు లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. ఈ వడలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి.