Gas Problem:ఏం తిన్నా, తినకపోయినా కడుపులో గ్యాస్, ఉబ్బరం, మంట వంటి సమస్యలు రోజంతా ఇబ్బంది పెడుతున్నాయా?
Gas Problem home remedies in telugu :ఏం తిన్నా, తినకపోయినా కడుపులో గ్యాస్, ఉబ్బరం, మంట వంటి సమస్యలు రోజంతా ఇబ్బంది పెడుతున్నాయా? ఉదయం లేవగానే కొన్ని సరైన అలవాట్లను పాటిస్తే ఈ సమస్యలు తగ్గడమే కాకుండా, మీ రోజు ఆరోగ్యంగా, ఉత్సాహంగా సాగుతుంది.
మారిన జీవనశైలి,జంక్ food ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అలవాట్లు గ్యాస్ సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కొంతమందికి ఏం తిన్నా, తినకపోయినా కడుపు నిండినట్లు, గ్యాస్ పట్టేసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల బయటకు వెళ్లాలన్నా, ఏదైనా తినాలన్నా భయపడతారు. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్‌ను పూర్తిగా మానేసినా, ఇంటర్నెట్‌లో చూసిన టిప్స్ ఫాలో చేసినా ఫలితం అంతగా కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు, కొన్ని ఉదయపు అలవాట్లు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, గట్ హెల్త్‌ను బాగు చేస్తాయి.
మన ఆరోగ్యం ఎంత బాగుందనేది మన గట్ హెల్త్‌పై ఆధారపడి ఉంటుంది. గట్ ఆరోగ్యంగా ఉంటే, మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ, నీటి కాలంలో చాలా మంది గట్ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం—తప్పుడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటివి. అందుకే, ఉదయాన్నే సరైన అలవాట్లతో రోజును ప్రారంభిస్తే, జీర్ణక్రియ మెరుగవడమే కాక, హార్మోన్ల సమతుల్యత, శక్తి స్థాయిలు కూడా మెరుగవుతాయి.

న్యూట్రిషనిస్ట్ తనీషా బావా సూచించిన కొన్ని సులభమైన టిప్స్‌ను ఫాలో అయితే, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి, రోజంతా ఉత్తేజంగా మరియు ఉషారుగా ఉండొచ్చు.
గట్ హెల్త్ సమస్యల లక్షణాలు
రోజంతా ఉబ్బరం, గ్యాస్
మలబద్ధకం
ఛాతీలో, కడుపులో మంట
పొట్టలో నొప్పి
త్రేన్పులు
ఆహారం అరగకపోవడం
నీరసం, అలసట
బద్ధకం
ఉదయం ఫాలో చేయాల్సిన అలవాట్లు
1. మెడిటేషన్
మెడిటేషన్ మనసును ప్రశాంతంగా ఉంచడమే కాక, శరీరాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి గట్ హెల్త్‌కు అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాక, జీర్ణక్రియ మెరుగవుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మాయో క్లినిక్ ప్రకారం, మెడిటేషన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడమే కాక, దృష్టిని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
2. గోరువెచ్చని డ్రింక్స్
ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు లేదా అలోవెరా జ్యూస్, నిమ్మరసం, పసుపు కలిపిన నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రియమవుతుంది. ఇది ఆహారాన్ని కడుపులో సులభంగా కదిలేలా చేస్తుంది. టీ, కాఫీలలోని కెఫిన్ జీర్ణ సమస్యలను పెంచే అవకాశం ఉంది కాబట్టి, వీటిని నివారించి గోరువెచ్చని నీటిని ఎంచుకోవడం మంచిది.
3. ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్
ఉదయం ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్డు, పాల ఉత్పత్తులు, అవకాడో వంటివి గట్ లైనింగ్‌ను బలోపేతం చేస్తాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరిచి, జీవక్రియను పెంచుతాయి. దీనివల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
ఇతర ముఖ్యమైన టిప్స్
ప్రీబయోటిక్ ఫుడ్స్: పెరుగు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు వంటి ప్రీబయోటిక్స్ ఉన్న ఆహారాలు గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి.
ఆయిలీ, స్పైసీ ఫుడ్స్‌ను తగ్గించండి: ఇవి జీర్ణ సమస్యలను పెంచవచ్చు.
తగినంత నీరు తాగండి: హైడ్రేషన్ జీర్ణక్రియకు చాలా ముఖ్యం.
మంచి నిద్ర: రాత్రి నాణ్యమైన నిద్ర గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.
హెల్త్ చెకప్: అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
గమనిక
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ టిప్స్‌ను అనుసరించే ముందు, వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రభావానికి chaipakodi బాధ్యత వహించదు.

