Healthhealth tips in telugu

Grapes:ఇష్టం కదా అని ద్రాక్షపండ్లు ఎక్కువగా తినేస్తే.. ఈ తిప్పలు తప్పవు!

Grapes:ఇష్టం కదా అని ద్రాక్షపండ్లు ఎక్కువగా తినేస్తే.. ఈ తిప్పలు తప్పవు.. ద్రాక్షలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఎక్కువగా తింటే నష్టాలు కూడా తప్పవు. ద్రాక్ష చాలా తియ్యగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు రావచ్చు. కాబట్టి పరిమితంగా తినడమే మంచిది. ఎక్కువ ద్రాక్ష తింటే ఏమవుతుందో తెలుసా?

బరువు పెరుగుదల:
ద్రాక్షలో కేలరీలు ఎక్కువ. ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. విటమిన్-కె, థయామిన్, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కాపర్ ఉన్నా, అధిక మోతాదు బరువు పెంచుతుంది.

విరేచనాలు:
అవసరం కంటే ఎక్కువ తింటే కడుపు లూజ్ అవుతుంది. తియ్యదనం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఎక్కువ తినకూడదు.
ఇది కూడా చదవండి:రుద్రాక్షల గురించి చలామణీలో ఉన్న అపోహలు… వాస్తవాలు!
కిడ్నీ సమస్యలు:
మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త! ఎక్కువ తింటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు. డయాబెటిక్ రోగులకు చక్కెర స్థాయి పెరిగి ప్రమాదం పెంచుతుంది.

అలర్జీలు:
ద్రాక్షలోని లిపిడ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటీన్ అలర్జీలు తెప్పిస్తుంది. చేతులు, కాళ్లు, ముఖం దురద, దద్దుర్లు, వాపులు వచ్చే అవకాశం ఉంది. తీవ్రంగా అనాఫిలాక్సిస్ కూడా రావచ్చు.

గర్భిణీలకు ఇబ్బందులు:
ద్రాక్షలోని పాలీఫినాల్స్ బిడ్డ ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తాయి. గర్భధారణ మధుమేహం రావడం, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."