Healthhealth tips in telugu

Nerve Weakness:నరాల బలహీనత వేధిస్తోందా? చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? ఇవి నానబెట్టి తింటే 40లో కూడా 25 ఏళ్ల జోష్!

Nerve Weakness:నరాల బలహీనత వేధిస్తోందా? చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? ఇవి నానబెట్టి తింటే 40లో కూడా 25 ఏళ్ల జోష్..ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటాయంటే చాలు.. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల్లో సత్తువ లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘నరాల బలహీనత’ (Nerve Weakness). పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చి వయసు పైబడిన వారిలా కనిపిస్తున్నారు.

దీనికి చెక్ పెట్టడానికి, నరాలను ఎలక్ట్రిక్ వైర్లలా యాక్టివ్‌గా మార్చడానికి ఒక అద్భుతమైన ఇంటి చిట్కా ఉంది. దీన్ని పాటిస్తే 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా చురుగ్గా ఉంటారు.

కావాల్సిన పదార్థాలు:
ఓట్స్ (Oats) – పావు కప్పు
ఎండు ద్రాక్ష / కిస్ మిస్ (Raisins) – 10
పాలు లేదా నీళ్లు

తయారీ విధానం (Remedy):
ఒక కప్పులో పావు కప్పు ఓట్స్, 10 కిస్ మిస్ తీసుకోండి.ఇందులో కాచి చల్లార్చిన పాలు పోయాలి (పాలు ఇష్టం లేనివారు నీళ్లు పోసుకోవచ్చు).ఈ మిశ్రమాన్ని సుమారు 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి.

ఎప్పుడు తీసుకోవాలి?
ఆప్షన్ 1: రాత్రి నానబెట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినొచ్చు. దీనివల్ల రోజంతా గుర్రం లాంటి వేగంతో పనిచేస్తారు.
ఆప్షన్ 2: లేదా మధ్యాహ్నం నానబెట్టి, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో స్నాక్స్ లాగా తినొచ్చు.

ఫలితాలు ఎలా ఉంటాయి? కేవలం 10 రోజులు క్రమం తప్పకుండా ఇలా తీసుకుంటే..

నరాల బలం: చేతులు, కాళ్ల వణుకు తగ్గి నరాలు బలంగా మారుతాయి.

కీళ్ల నొప్పులు మాయం: నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గ్లోయింగ్ స్కిన్: ఇందులో ఉండే పోషకాల వల్ల చర్మం మెరిసిపోతూ, యవ్వనంగా కనిపిస్తారు.

దాంపత్య జీవితం: శారీరక బలహీనత తగ్గి, వైవాహిక జీవితంలో ఉత్సాహంగా ఉంటారు.

ముగింపు: ఖరీదైన మందులు వాడే బదులు, వంటింట్లో దొరికే ఈ సహజమైన ఆహారాన్ని ట్రై చేయండి. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."