Healthhealth tips in telugu

Ajwain water:కేవలం 3 రోజులు.. పరగడుపున ‘వాము నీళ్లు’ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Ajwain water:కేవలం 3 రోజులు.. పరగడుపున ‘వాము నీళ్లు’ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా.. మన వంటింట్లో ఉండే అద్భుతమైన ఔషధం ‘వాము’ (Ajwain). పూర్వీకుల కాలం నుంచి ఆయుర్వేదం వరకు వామును ఆరోగ్య సంజీవనిగా చెబుతారు. మరి కేవలం 3 రోజులు వాము నీటిని తాగితే మీ శరీరంలో వచ్చే ఆశ్చర్యకరమైన మార్పులేంటో చూడండి!

వాము నీటిని తయారు చేసుకోవడం ఎలా?
చాలా సులభం! ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:ఒక స్పూన్ వామును తీసుకుని దోరగా వేయించండి.దీనిని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించి, వడగట్టాలి.నీళ్లు కాస్త గోరువెచ్చగా అయ్యాక సిప్ చేస్తూ తాగాలి.

ఈ నీటిని తాగడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు:
1. గ్యాస్ & పొట్ట ఉబ్బరానికి చెక్:
ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు ఈ నీటితో ఇట్టే తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

2. వేగంగా బరువు తగ్గుతారు (Weight Loss):
వాములో ఉండే ‘థైమోల్’ (Thymol) కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా, శక్తిగా మారేలా చేసి బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

3. మలబద్ధకం నివారణ:
జీర్ణ సమస్యలతో పాటు, గర్భధారణ సమయంలో స్త్రీలకు వచ్చే మలబద్ధకం సమస్యను నివారించడంలో వాము నీరు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

4. జలుబు, దగ్గుకు దివ్యౌషధం:
ఋతువులు మారినప్పుడు వచ్చే జలుబు, గొంతు నొప్పికి ఇది బెస్ట్ మెడిసిన్.

చిట్కా: గ్లాసు నీటిలో అరస్పూన్ వాము, 4 తులసి ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

5. బాడీ డిటాక్స్:
ఇది శరీరాన్ని శుభ్రపరచి, మలినాలను బయటకు పంపుతుంది.

గమనిక: ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."