Devotional

Ugadi 2026:ఉగాది వచ్చేస్తోంది.. ఏ రోజు జరుపుకోవాలి? తిథి సమయాలు ఇక్కడ తెలుసుకోండి

Ugadi 2026:ఉగాది వచ్చేస్తోంది.. ఏ రోజు జరుపుకోవాలి? తిథి సమయాలు ఇక్కడ తెలుసుకోండి.. తెలుగు వారి తొలి పండుగ.. కొత్త ఆశలకు, కొత్త లక్ష్యాలకు నాంది పలికే పండుగ ‘ఉగాది’. కోయిలల కిలకిలలు, మామిడి పిందెలు, వేప పూతలతో ప్రకృతి సైతం కొత్త కళను సంతరించుకునే వసంత కాలంలో వచ్చే ఈ పండుగ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ ఏ రోజు వచ్చింది? ఈ కొత్త సంవత్సరం పేరేంటి? పూజా సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం పేరు ఏంటంటే..
ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి రోజున హిందువులు ఉగాది జరుపుకుంటారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాదితో పాటు సంవత్సరం పేరు కూడా మారుతుందన్న విషయం తెలిసిందే. ఈ 2026లో రాబోయే కొత్త సంవత్సరానికి ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ అని పేరు.

ఉగాది తేదీ, తిథి వివరాలు:
ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19 (గురువారం) వచ్చింది.
పాడ్యమి తిథి ప్రారంభం: మార్చి 19, ఉదయం 6:53 గంటలకు.
పాడ్యమి తిథి ముగింపు: మార్చి 20, తెల్లవారుజామున 4:52 గంటలకు.

ఉగాది రోజున ఏం చేస్తారంటే..
‘యుగం + ఆది = ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైన దినం అని పెద్దలు చెబుతారు. ఈ పండుగ రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి, తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇష్టదైవాన్ని పూజించి, గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.

ఉగాది పచ్చడి.. ఆరోగ్యానికి పెద్దపీట!
ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ‘ఉగాది పచ్చడి’. తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, పులుపు.. ఇలా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు ప్రతీకగా ఈ పచ్చడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. వాతావరణం మారే ఈ సమయంలో వచ్చే ఎన్నో రోగాల నుంచి రక్షించే ఔషధ గుణాలు ఈ పచ్చడిలో పుష్కలంగా ఉంటాయి.

పంచాంగ శ్రవణం:
ఉగాది పచ్చడి తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్నది ‘పంచాంగ శ్రవణం’. ఈ కొత్త సంవత్సరంలో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏయే గ్రహాల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ రోజున పంచాంగం వింటారు.

మరి ఇంకెందుకు ఆలస్యం.. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు సిద్ధమైపోండి!

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."