Hair care Tips:ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది!
Hair care Tips:ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.. ఈ రోజుల్లో జుట్టు రాలడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య.
దీనికోసం రకరకాల షాంపూలు, నూనెలు వాడి, పార్లర్ల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చుపెట్టి విసిగిపోయారా? అయితే పెద్దగా ఖర్చు లేకుండా, మన ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా తయారు చేసుకునే ఈ న్యాచురల్ చిట్కా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు.
ఈ మ్యాజిక్ హెయిర్ ప్యాక్‌కి కావాల్సినవి:
పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు
బాగా పండిన అరటిపండు – 1
నీళ్లు – 1 కప్పు
ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి?
ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్లో నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి, అందులో నుంచి స్వచ్ఛమైన కొబ్బరి పాలను (Coconut Milk) ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు బాగా పండిన అరటిపండును తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి పాలలో.. ఈ అరటిపండు పేస్ట్‌ను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంతే న్యాచురల్ హెయిర్ ప్యాక్ రెడీ!ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల (Roots) నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, ఓ 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.పావుగంట తర్వాత మీరు రెగ్యులర్‌గా వాడే షాంపూతో తలస్నానం చేసేయాలి.
ఈ ప్యాక్ ఎందుకు అంత పవర్‌ఫుల్?
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం వెంటనే కంట్రోల్ అవుతుంది.అరటిపండు, కొబ్బరి పాలలో ఉండే పోషకాలు, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.జుట్టు చివర్లు చిట్లిపోయి రఫ్ గా మారిన వారికి ఈ హెయిర్ ప్యాక్ ఒక న్యాచురల్ కండిషనర్‌లా అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ సిల్కీగా, షైనీగా మారుతుంది.ఎలాంటి కెమికల్స్ లేని ఈ ఇంటి చిట్కాను మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

