Gas Problem:గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 2 వస్తువులతో క్షణాల్లో చెక్ పెట్టండి!
Gas Problem:గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇంట్లోనే ఉండే ఈ 2 వస్తువులతో క్షణాల్లో చెక్ పెట్టండి.. మారిన జీవనశైలి, సమయానికి భోజనం చేయకపోవడం, జంక్ ఫుడ్స్ వల్ల ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి.
వీటికి తోడు వాతావరణ మార్పుల వల్ల రోగనిరోధక శక్తి (Immunity) తగ్గిపోతుంటుంది. చిన్న చిన్న సమస్యలకే మందులు, ట్యాబ్లెట్ల మీద ఆధారపడే బదులు.. మన వంటగదిలో దొరికే కేవలం రెండే రెండు వస్తువులతో తయారుచేసే ఈ న్యాచురల్ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది.
అదే ‘జీలకర్ర – బెల్లం’ పానీయం. దీన్ని ఎలా తయారు చేయాలి? దీనివల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తయారీకి కావాల్సినవి:
నీళ్లు – 1 గ్లాసు
జీలకర్ర – అర స్పూన్
బెల్లం – చిన్న ముక్క
ఎలా తయారు చేయాలి?
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోయాలి.అందులో అర స్పూన్ జీలకర్ర వేసి కనీసం 3 నిమిషాల పాటు బాగా మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేసి మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆపేయాలి.ఇప్పుడు ఆ నీటిని వడగట్టుకుని, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
ఈ ఒక్క డ్రింక్ తో ఎన్ని లాభాలంటే..
గ్యాస్, ఎసిడిటీకి చెక్: జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, మంట నుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి.
100% రోగనిరోధక శక్తి: ఈ నీటిని రోజు విడిచి రోజు తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ బలోపేతం అవుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
ఆకలి పెరుగుతుంది: జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, ఆకలి లేని వారిలో ఆకలిని సహజంగా పెంచుతుంది.
బరువు తగ్గుతారు: శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి, అధిక బరువు తగ్గడానికి కూడా ఈ డ్రింక్ బాగా సహాయపడుతుంది.
ఎప్పుడు తాగాలి?
గ్యాస్ సమస్య ఉన్నవారు: ఉదయం పరగడుపున లేదా గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్న సమయంలో రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.
బరువు తగ్గడానికి/ఇమ్యూనిటీ కోసం: రోజులో ఏ సమయంలోనైనా ఈ డ్రింక్ తాగవచ్చు.
(గమనిక: ఈ ఇంటి చిట్కా ప్రారంభ దశలో ఉన్న గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. కానీ సమస్య చాలా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం మంచిది).
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

