Ugadi 2026 Astrology:ఉగాది తర్వాత ఈ 6 రాశులకు రాజయోగం.. ఆ రెండు నెలలు పట్టిందల్లా బంగారమే!
Ugadi 2026 Astrology:ఉగాది తర్వాత ఈ 6 రాశులకు రాజయోగం.. ఆ రెండు నెలలు పట్టిందల్లా బంగారమే..ఉగాది పండుగ తర్వాత గ్రహాల కదలికల్లో వచ్చే భారీ మార్పులు కొందరి జీవితాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా గురువు వక్ర త్యాగం చేయడం, అలాగే సూర్యుడు (రవి), శుక్రుడు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది.
గ్రహాల అనుకూలత వల్ల సుమారు రెండు నెలల పాటు వీరికి రాజపూజ్యాలు, రాజయోగాలు దక్కుతాయి. సామాన్యులు కూడా సంపన్నుల స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి? వారికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఇక్కడ చూద్దాం:
మేష రాశి (Aries): ఈ రాశి వారికి రవి, రాహువు, శుక్ర, గురువుల అనుకూలత వల్ల రాబోయే రెండు నెలలు అంతా శుభమే జరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. చిన్న ప్రయత్నంతోనే సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది.
మిథున రాశి (Gemini): గ్రహాల మార్పుతో ఈ రాశికి లాభ, దశమ స్థానాలు బాగా బలపడుతున్నాయి. దీనివల్ల విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు అవుతాయి. పెళ్లి లేదా గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే!
కర్కాటక రాశి (Cancer): వీరికి సూర్యుడు, శుక్రుడు భాగ్య, దశమ స్థానాల్లో ఉండటం వల్ల అన్ని చోట్లా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గురువు అనుగ్రహం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి, ఉద్యోగ విషయాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. ఆస్తి లాభంతో పాటు, ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి (Virgo): దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారికి రాజపూజ్యాలు కలుగుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా దూరమై ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి.
తులా రాశి (Libra): ఈ రాశి వారికి షష్ట, సప్తమ స్థానాలు బలపడటం వల్ల ఇంటా బయటా విపరీతమైన గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. రాజయోగాలు పడతాయి. ఆదాయం భారీగా పెరిగి, అనుకున్న పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో మీ హోదా పెరిగి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మకర రాశి (Capricorn): వీరికి ఆర్థిక కష్టాలు అన్నీ తీరిపోయి, ఆదాయం అమాంతం పెరుగుతుంది. పాలకుల నుంచి లేదా ప్రభుత్వ పరంగా సత్కారాలు, లాభాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడమే కాకుండా జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

