Kidney Diseases :మీకు ఒకే కిడ్నీ ఉందా? అయితే ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి! లేదంటే ముప్పు తప్పదు..
Kidney Diseases In Telugu :మీకు ఒకే కిడ్నీ ఉందా? అయితే ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి! లేదంటే ముప్పు తప్పదు..సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు (మూత్రపిండాలు) ఉంటాయి. కానీ, పుట్టుకతోనే కొందరికి ఒక కిడ్నీ మాత్రమే ఉండొచ్చు, లేదా ఏదైనా వ్యాధి వల్లనో, దానం చేయడం వల్లనో ఒక కిడ్నీతోనే జీవించాల్సి రావచ్చు.
“ఒకే కిడ్నీతో ఆరోగ్యంగా బతకగలమా?” అని చాలామంది కంగారు పడుతుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, ఒక కిడ్నీతో కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా హ్యాపీగా జీవించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, మీ శరీరంలో ఉన్న ఆ ఒక్క కిడ్నీని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే మాత్రం మీ జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా ఈ 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
ఒక కిడ్నీ ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
1. బీపీ (రక్తపోటు) కంట్రోల్‌లో ఉండాలి:
ఒక కిడ్నీ ఉన్నవారు ముందుగా జాగ్రత్త పడాల్సింది బ్లడ్ ప్రెజర్ (BP) గురించే. బీపీ పెరిగితే, దాని ప్రభావం నేరుగా కిడ్నీపై పడుతుంది. అందుకే రెగ్యులర్‌గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, రక్తపోటు ఎప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
2. యూరిన్‌లో ప్రోటీన్ పోతుందేమో గమనించండి:
కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే, రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల శరీరంలో సోడియం, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ తప్పిపోయి.. ముఖం, కడుపు, లేదా కాళ్లలో (ముఖ్యంగా చీలమండల వద్ద) వాపులు వస్తాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి వాపులు కనిపిస్తే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
3. GFR (Glomerular Filtration Rate) టెస్ట్ తప్పనిసరి:
మీ కిడ్నీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో, రక్తంలోని వ్యర్థాలను ఎంతుబాగా వడకడుతుందో తెలుసుకోవడానికి ఈ GFR టెస్ట్ చేస్తారు. ఒక కిడ్నీ ఉన్నవారు తరచుగా ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.
చివరిగా..
ఒక కిడ్నీ ఉన్నవారు భయపడాల్సిన పనేమీ లేదు. కానీ నిర్లక్ష్యం పనికిరాదు. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, టైమ్‌కి డాక్టర్ చెకప్స్ చేయించుకుంటే.. ఒక కిడ్నీతోనే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

