Business

IRCTC Ooty–Coonoor Tour Package: తక్కువ ఖర్చుతో ఊటీ, కునూర్ ట్రిప్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

IRCTC Ooty–Coonoor Tour Package: తక్కువ ఖర్చుతో ఊటీ, కునూర్ ట్రిప్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే.. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశపు అందమైన హిల్ స్టేషన్లు ‘ఊటీ – కునూర్’ చుట్టి వచ్చేందుకు IRCTC ఒక అద్భుతమైన 5 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

దొడ్డబెట్ట శిఖరం మొదలుకొని ముదుమలై అభయారణ్యం వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఈ ట్రిప్‌లో కవర్ చేయనున్నారు. మరి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్యాకేజీ హైలైట్స్ ఇవే..
ప్యాకేజీ పేరు: ఊటీ – కునూర్ టూర్ ప్యాకేజీ
వ్యవధి: 5 రోజులు
ఎక్కడి నుంచి?: చెన్నై సెంట్రల్ స్టేషన్
ప్రయాణ తేదీ: మార్చి 19, 2026 (రాత్రి 9:05 గంటలకు ప్రారంభం)

టూర్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే?
మొదటి రోజు: చెన్నైలో రాత్రి ట్రైన్ ఎక్కితే, ఉదయం 6:20 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో ఊటీలోని హోటల్‌కు తీసుకెళ్తారు.

ఊటీ సైట్ సీయింగ్: ఫ్రెషప్ అయ్యాక దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు తదితర ప్రాంతాలను సందర్శిస్తారు.

మరుసటి రోజు: పైకారా జలపాతం, ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం, ఎలిఫెంట్ క్యాంప్ (జంగిల్ సఫారీ) కు వెళ్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో కునూర్ వెళ్లి.. అక్కడ సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్ చూస్తారు.

తిరుగు ప్రయాణం: టూర్ ముగిశాక మెట్టుపాళయం చేరుకుని, రాత్రి 8:20 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు. మరుసటి రోజు ఉదయం 6:25 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు (ఒక్కొక్కరికి):
సింగిల్ షేరింగ్ (ఒక్కరే వెళితే) – రూ. 22,630
డబుల్ షేరింగ్ (ఇద్దరు వెళితే) – రూ. 11,830
ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురు వెళితే) – రూ. 9,710

ఈ ప్యాకేజీలో ఏమేం కల్పిస్తారు?
రాను-పోను రైలు టిక్కెట్లు
హోటల్ బస (Accommodation)
ఉదయం బ్రేక్ ఫాస్ట్
లోకల్ సైట్ సీయింగ్ కోసం రవాణా సౌకర్యం

గమనిక: మధ్యాహ్నం, రాత్రి భోజనం.. అలాగే పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ ఫీజులు, జంగిల్ సఫారీ టికెట్లు పర్యాటకులే సొంతంగా భరించాల్సి ఉంటుంది.

ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ బడ్జెట్ ట్రిప్‌కు వెళ్లాలనుకునే వారు IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా IRCTC మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."