Varasuralu Soudhamini: స్టార్ మా ‘వారసురాలు’ సౌదామిని రియల్ లైఫ్: హీరోయిన్లను మించేలా ఆస్తులు.. రోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే?
Varasuralu Soudhamini: స్టార్ మా ‘వారసురాలు’ సౌదామిని రియల్ లైఫ్: హీరోయిన్లను మించేలా ఆస్తులు.. రోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..స్టార్ మా (Star Maa) లో ప్రసారమయ్యే సీరియల్స్‌కు ఉండే క్రేజే వేరు.
ఈ ఏడాది జనవరిలో సరికొత్త కథాంశంతో మొదలైన బ్లాక్ బస్టర్ సీరియల్ ‘వారసురాలు’. ఆస్తి వివాదాలతో విడిపోయిన అన్నదమ్ములు.. వారిని కలపడానికి వారసురాలైన కూతురు చేసే పోరాటమే ఈ సీరియల్ కథ. అయితే, ఈ సీరియల్లో అత్త ‘సౌదామిని’ పాత్రలో నటిస్తూ తన గంభీరమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న నటి అర్చన (Archana).
గతంలో ‘కార్తీకదీపం’ సీరియల్లో డాక్టర్ బాబుకు తల్లి (సౌందర్య)గా నటించి మెప్పించిన ఈమె.. రియల్ లైఫ్ స్టైల్, ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
సౌదామిని (అర్చన) బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
అర్చన బుల్లితెరకు కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె ఒక మోడల్. ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘కుంకుమ పువ్వు’, ‘కేరాఫ్ అనసూయ’, ‘కార్తీకదీపం’ లాంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘వారసురాలు’ సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘వారసురాలు’ కథలో ఆమెదే కీ రోల్..
హరిచంద్ర ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి చిచ్చు పెట్టి.. వారు ఎప్పటికీ కలవకుండా కుట్రలు చేసే బావమరిది పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే హీరోయిన్ (మైథిలి) ఆ అన్నదమ్ములను ఎలా కలుపుతుంది? ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో సీరియల్ సాగుతోంది. ఇందులో సౌదామినిది ఎంతో కీలకమైన పాత్ర.
ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అర్చన టీవీ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్, పాపులర్ నటి కావడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుందని సోషల్ మీడియాలో టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఒక్కరోజు షూటింగ్‌కు ఏకంగా రూ. 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.ఈ లెక్కన ఆమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నారు.
హీరోయిన్లను మించిన ఆస్తులు..
మొదటినుంచీ మోడలింగ్, ఆ తర్వాత హిట్ సీరియల్స్ చేస్తూ వస్తుండటంతో అర్చన బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది.బుల్లితెర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమెకు ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. నటన ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం బ్యాంకుల్లో దాచుకోకుండా, పలు వ్యాపారాల్లో కూడా (Investments) పెట్టుబడులు పెడుతున్నారట.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అర్చన.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, షూటింగ్ అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

