Healthhealth tips in telugu

బరువు తగ్గాలన్నా, మతిమరుపు పోవాలన్నా.. ఈ అద్భుత మూలిక గురించి తెలుసుకోవాల్సిందే!

Ashwagandha Benefits: అశ్వగంధ ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు. మతిమరుపును తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచడంలో, అలాగే ఒత్తిడిని తగ్గించి వేగంగా బరువు తగ్గించడంలో అశ్వగంధ ఎలా పనిచేస్తుందో ఈ ఆర్టికల్‌లో సవివరంగా తెలుసుకోండి. మీ ఆరోగ్యానికి ఈ ఆయుర్వేద సంజీవని చేసే మేలు అంతా ఇంతా కాదు!

ఔషధ మూలికల్లో అశ్వగంధ ఒక పురాతన మూలిక. మూడు వేల సంవత్సరాల నుండి ఈ మూలికను వాడుతున్నారు. ఇది శరీరంలో లోపల, బయట ఆరోగ్యవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. అశ్వగంధలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, న్యూట్రీషియన్ సమృద్దిగా ఉండుట వలన శరీరం ఎటువంటి సమస్యలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Ashwagandha
డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ లెవల్ పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడిని పెంచే హార్మోను ఎక్కువగా విడుదల కాకుండా చూస్తుంది. ఒకవేళ ఎక్కువగా విడుదల అయితే ఆ ప్రభావం షుగర్ లెవల్స్ మీద పడుతుంది. అశ్వగంధలోని వితాఫెరిన్ అనే పదార్ధం క్యాన్సర్ ని అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.

టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి వంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేయటమే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటపడతారు. నెగిటివ్ ఆలోచనల నుండి పొజిటివ్ ఆలోచనల వైపు సాగేలా చేస్తుంది. కండరాలకు బలాన్ని అందిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

అశ్వగంధ వాడే వారి బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. మతిమరపు లక్షణాలు వారిలో కనిపించవు.చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. జీవక్రియను పెంచి కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఎంత మోతాదులో తీసుకోవాలో అనే విషయాన్ని ఆయుర్వేద వైధ్య నిపుణున్ని సంప్రదించాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."