Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగున పేరుకుపోయిన మొండి జిడ్డు వదలడం లేదా? ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరిసిపోతుంది!
Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగున పేరుకుపోయిన మొండి జిడ్డు వదలడం లేదా? ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరిసిపోతుంది..వంట గదిలో మనం అత్యధికంగా వాడే వస్తువుల్లో మిక్సీ ఒకటి. మసాలాలు, పిండి, చట్నీలు.. ఇలా రోజుకు ఎన్నిసార్లో దీని అవసరం పడుతుంది.
అయితే చాలామంది మిక్సీ జార్లను పైన పైన కడిగేసి వదిలేస్తుంటారు. కానీ అసలు మురికి బ్లేడ్ల కింద, జార్ అడుగు భాగంలో దాగి ఉంటుంది. ఈ మురికిని నిర్లక్ష్యం చేస్తే బాక్టీరియా చేరి ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
సాధారణంగా చేత్తో రుద్దినా వదలని ఆ మొండి జిడ్డును వదిలించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. కేవలం మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే జార్‌ను కొత్తదానిలా మార్చేయొచ్చు.
కావలసిన పదార్థాలు:
బేకింగ్ సోడా – 1 స్పూన్
నిమ్మరసం – సగం చెక్క
డిటర్జెంట్ పౌడర్ – అర స్పూన్
వేడి నీళ్లు – తగినన్ని
క్లీనింగ్ ప్రాసెస్ ఇదే:
ముందుగా మిక్సీ జార్ అడుగు భాగంలో బేకింగ్ సోడా వేయండి. దానిపై నిమ్మరసం పిండగానే నురుగు వస్తుంది. ఆ తర్వాత డిటర్జెంట్ పౌడర్ వేసి కొద్దిగా వేడి నీళ్లు పోయండి.ఈ మిశ్రమాన్ని జార్‌లో సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. వేడి నీళ్లు మరియు బేకింగ్ సోడా చర్య వల్ల బ్లేడ్ల కింద ఉన్న మొండి జిడ్డు మెత్తబడుతుంది.
15 నిమిషాల తర్వాత పాత టూత్ బ్రష్ లేదా మార్కెట్లో దొరికే పొడవాటి క్లీనింగ్ బ్రష్‌తో బ్లేడ్ల కింద, మూలల్లో బాగా రుద్దండి. ఇలా చేయడం వల్ల ఎంతటి మొండి మురికి అయినా ఇట్టే ఊడి వచ్చేస్తుంది. చివరగా మంచినీటితో కడిగేస్తే మీ జార్ కొత్తదానిలా మెరిసిపోతుంది.
మరిన్ని జాగ్రత్తలు:
జార్ కడిగిన వెంటనే బోర్లించకుండా, కాసేపు గాలికి ఆరనివ్వాలి. తేమ ఉంటే బ్లేడ్లు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది.మసాలాలు రుబ్బిన వెంటనే జార్‌ను నీటితో కడగడం అలవాటు చేసుకోండి. ఆరిపోతే మురికి వదలడం కష్టమవుతుంది.
బ్లేడ్లు పదును పెరగాలంటే: బ్లేడ్లు సరిగ్గా తిరగకపోయినా లేదా మొద్దుబారినా.. నెలకోసారి జార్‌లో కొద్దిగా రాతి ఉప్పు (కల్లుప్పు) వేసి ఒకటి రెండు నిమిషాలు మిక్సీ పట్టండి. దీనివల్ల బ్లేడ్లు మళ్ళీ షార్ప్‌గా తయారవుతాయి.
ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే మీ మిక్సీ జార్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

