Beauty TipsHealth

ఎప్పుడైనా ‘కాటుక ఆకు’ గురించి విన్నారా? ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే!

Gunta galagara plant Benefits In telugu : ఎప్పుడైనా ‘కాటుక ఆకు’ గురించి విన్నారా? ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే! కాటుక ఆకు అంటే గుంటగలగరాకు. ఈ ఆకు పల్లెటూర్లో ఉండే వారికి సుపరిచితమే. వర్షాకాలం వచ్చినప్పుడు నీరు ఎక్కువగా ఉండే ప్రదేశంలోనూ పంట పొలాల గట్లపై ఎక్కువగా ఈ మొక్క కనబడుతూ ఉంటుంది ఈ మొక్క ఆకులు పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆకుతో తయారు చేసిన నూనెను మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. మనం ఇంటిలో కూడా ఈ నూనె తయారు చేసుకోవచ్చు. కొబ్బరినూనెలో ఈ ఆకులను వేసి బాగా మరిగించి ప్రతిరోజు రాసుకోవచ్చు. ప్రతిరోజు ఈ నూనెను రాసుకోవడం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

hair fall tips in telugu
అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. ఈ ఆకులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేస్తుంది. యాంటీ మైక్రోబయల్,యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు తగ్గించడంలో సహాయపడుతుంది. తెల్లజుట్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ నూనెను ప్రతి రోజూ రాస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
White Hair Tips
కాబట్టి ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. వీలైతే మీ ఇంటిలో ఈ మొక్కను పెంచుకోండి. ఈ మొక్క జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఇటువంటి మొక్కలు కనిపించినప్పుడు అశ్రద్ద చేయకుండా వాడటానికి ప్రయత్నించండి.

దీనిలో ఉన్న ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ మొక్కను ఉపయోగించి ఎటువంటి ఖర్చు లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."