Kitchenvantalu

అమ్మమ్మల నాటి కిచెన్ సీక్రెట్: బియ్యం ఎన్నాళ్లయినా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Kitchen Tips in telugu :ఒక్కోసారి బియ్యం ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పడుతుంది. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యకు సులువైన చిట్కా ఉంది. అది ఏమిటంటే వేపాకులను ఎండబెట్టి పొడి చేసి మూట కట్టి బియ్యంలో వేయాలి. వేపాకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండుట వలన పురుగులు బియ్యంలోకి చేరవు.
Storing foods in fridge

మనం ఫ్రిడ్జ్ లో ఎన్నో రకాలను పెడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన వాసన రావటాన్ని గమనిస్తాం. అయితే ఈ వాసన ఎలా పోతుందో అని కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటించండి. ఒక నిమ్మకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో మూల పెడితే ఫ్రిడ్జ్ లో ఉన్న చెడు వాసనలను పీల్చుకుంటుంది. దాంతో ఫ్రిడ్జ్ వాసన లేకుండా ఉంటుంది.

చపాతీలను చేసి పిలల్లకు లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటాం. వాటిని పిల్లలు తినేసరికి గట్టిగా ఉండి తినటానికి చాలా కష్టంగా ఉంటుంది. చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు నీటికి బదులుగా గోరువెచ్చని పాలను ఉపయోగిస్తే చపాతీలు మెత్తగా,మృదువుగా వస్తాయి.

ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటిస్తే వంట త్వరగా అవ్వటమే కాకుండా డబ్బు కూడా అదా అవుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."