Beauty Tips

జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు దీన్ని పట్టిస్తే.. రాలడం ఆగి విపరీతంగా పెరుగుతుంది!

Hair Growth Tips in Telugu :ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘జుట్టు రాలడం’. కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడి, పోషకాల లోపం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి రాలిపోతుంటుంది. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా? అయితే, మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసే ఈ అద్భుతమైన ప్యాక్‌ను వాడి చూడండి.

దీన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టిస్తే, కేవలం కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా, పొడవుగా పెరగడం మీరే గమనిస్తారు.

జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఒత్తుగా పెరగటానికి మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి చాలా విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద ఉంటే చాలు ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
kalabanda benefits in telugu

దీని కోసం కలబందను తీసుకొని సైడ్స్ లో ఉండే బాగాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఈ ముక్కలు ఒక కప్పు ఉండేలా చూసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ టీ పొడి వేసి అవసరమైన నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని హెయిర్ స్కాల్ప్ దగ్గర బాగా అప్లై చేయాలి. ఈ స్కాల్ప్ దగ్గరే మనకు ఎక్కువగా జుట్టు రాలటం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ ఎక్కువగా అప్లై చేస్తే ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు రావడం ప్రారంభం అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
hair fall tips in telugu

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా జుట్టు కాంతివంతంగా మెరిసేలా ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."