Healthhealth tips in telugu

ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Lemon And Honey Health benefits In telugu :”రోజూ ఉదయం నిద్ర లేవగానే పరగడుపున వేడి నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగే అలవాటు మీకుందా? బరువు తగ్గుతారని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చాలామంది ఇలా చేస్తుంటారు. అయితే, ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల శరీరంలో జరిగే మార్పులు, లాభాలు మరియు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తవాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.”

ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!  ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి తీసుకొనే ఆహారం మీద శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. మనలో చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనే,నిమ్మరసం కలిపి త్రాగుతూ ఉంటారు.

తేనే, నిమ్మరసం రెండింటిలోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి తేనే,నిమ్మరసంలను సహజసిద్ధమైన వైద్యంలో వాడుతున్నారు. ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిదని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Honey benefits in telugu
నిమ్మకాయలో ఆమ్లం జీర్ణప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను,విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తరిమి కొడుతోంది. అంతేకాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రపరుస్తుంది.


జీర్ణంకాని ఆహారం, పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపు లోపలి పొర పూస్తుంది. దాంతో ఆ పరిస్థితి వ్యాధులకు దారి తీస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె కలిపి త్రాగటం ద్వారా ప్రేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు ఉత్తేజితమయి విషాలను బయటకు పంపుతుంది.
Honey
ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు.

lemon benefits
ఒకవేళ తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుంచుకోండి. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. కాబట్టి తేనె,నిమ్మరసం తాగి ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."