Jio Family Plans: ఒకే రీఛార్జ్‌తో ఫ్యామిలీ మొత్తం ఫిదా.. 4 సిమ్ కార్డ్స్, అన్‌లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్!
రిలయన్స్ జియో (Reliance Jio) తన యూజర్ల కోసం అద్భుతమైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఒక్కరికీ విడివిడిగా రీఛార్జ్ చేయించే అవసరం లేకుండా, ఒకే ప్లాన్‌తో కుటుంబం మొత్తానికి కనెక్టివిటీని అందించడమే ఈ ప్లాన్ల ముఖ్య ఉద్దేశ్యం. రూ. 449 నుంచే ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో లభించే బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రూ. 449 ప్లాన్: తక్కువ ధరలో ఎక్కువ లాభాలు
ఇది జియో అందిస్తున్న అత్యంత సరసమైన ఫ్యామిలీ ప్లాన్. దీని ప్రత్యేకతలు ఇవే:
వేసవిలో ఖాళీగా ఉంటున్నారా? కేవలం 40 రోజుల్లోనే లక్షలు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా ఇదే!
డేటా: నెలకు 75GB డేటా లభిస్తుంది.
యాడ్-ఆన్ సిమ్స్: ఒక మెయిన్ సిమ్ కాకుండా మరో 3 అదనపు సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు (ఒక్కో సిమ్‌కు రూ. 150 అదనంగా చెల్లించాలి).
అదనపు డేటా: ప్రతి యాడ్-ఆన్ సిమ్‌కు 5GB డేటా ఎక్స్‌ట్రా లభిస్తుంది.
కాల్స్ & SMS: అన్‌లిమిటెడ్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలు.
AI బెనిఫిట్స్: రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) 18 నెలల ప్లాన్ మరియు 5000GB క్లౌడ్ స్టోరేజ్ ఉచితం.
OTT: జియో టీవీ, జియో సినిమాతో పాటు 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ. 749 ప్లాన్: ఎంటర్టైన్‌మెంట్ కావాలనుకునే వారికి..
మీ కుటుంబంలో సినిమా ప్రియులు ఎక్కువగా ఉంటే ఈ ప్లాన్ బెస్ట్..
డేటా: 100GB మంత్లీ డేటా.
OTT ధమాకా: నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ ప్లాన్ మరియు 2 ఏళ్ల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
మిగిలిన బెనిఫిట్స్ అన్నీ రూ. 449 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.

