Beauty Tips

పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఈ చిన్న పని చేస్తే కంటి కింద నలుపు ఇట్టే పోతుంది!

How To Remove Dark Circles :ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు కంటి కింద నల్లని వలయాలతో ఇబ్బందులు పడటం సాధారణం అయింది. కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో చాలా సులభంగా బయట పడవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

నేటి కాలంలో నిద్రలేమి, ఒత్తిడి మరియు కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు గడపడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు (Dark Circles) రావడం సాధారణ సమస్యగా మారింది. ఇవి ముఖం అందాన్ని తగ్గించడమే కాకుండా, మిమ్మల్ని అలసిపోయినట్లుగా చూపిస్తాయి.

ఈ ఆర్టికల్‌లో ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో డార్క్ సర్కిల్స్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. కేవలం కొద్ది రోజుల్లోనే మీ కంటి చుట్టూ ఉన్న నలుపు పోయి, కళ్లు తాజాగా మరియు అందంగా ఎలా మారుతాయో స్టెప్ బై స్టెప్ వివరించాము. తప్పకుండా ప్రయత్నించి ఫలితాన్ని చూడండి!

కంటి కింది భాగంలో తేనెను రాసి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ టమోటా పేస్ట్, ఆర స్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు, చిటికెడు పెసర పిండి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని కళ్ళ చుట్టూ రాసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ప్రతి రోజు పడుకొనే ముందు బాదం ఆయిల్ కళ్ళ చుట్టూ రాసుకొని మసాజ్ చేసుకోవాలి.

పుదీనా రసాన్ని కళ్ళ చుట్టూ రాసుకొని, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కీరదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకొని 15 నిమిషాల తర్వాత తీసేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

బంగాళాదుంప రసాన్ని కళ్ళ చుట్టూ రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."