చిటికెడు ఈ పొడి చాలు.. 10 రోజుల్లో పొట్ట కొవ్వును మంచులా కరిగించే సీక్రెట్!
Weight Loss Powder In telugu : అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పెరిగి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

పెరుగుతున్న బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా? కరివేపాకు, అవిసె గింజలతో తయారు చేసిన ఈ ప్రత్యేక పొడిని కేవలం చిటికెడు తీసుకుంటే చాలు. ఇది మీ మెటబాలిజాన్ని పెంచి, కేవలం 10 రోజుల్లోనే అద్భుతమైన మార్పును చూపిస్తుంది.
జిమ్‌కు వెళ్లే టైమ్ లేదా? అయితే ఇంట్లోనే లభించే కరివేపాకు, అవిసె గింజలతో ఈ మ్యాజిక్ పౌడర్ తయారు చేసుకోండి. ఇది శరీరంలోని అనవసర వ్యర్థాలను బయటకు పంపి, మిమ్మల్ని ఫిట్‌గా మార్చడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.
మందులతో పనిలేకుండా సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ రెమెడీ. అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కరివేపాకులోని పోషకాలు కలిసి మీ బాడీని రీషేప్ చేస్తాయి. ఆ పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూడండి.
ఇవి కూడా చదవండి:
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి డాక్టర్స్ చుట్టూ తిరిగి ట్రీట్ మెంట్స్ అంటూ వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాలతో అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ పొడిని తయారుచేసుకోవడం కూడా సులభమే. ఒక్క సారి చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ప్రతి రోజు ఓపికగా తీసుకుంటూ ఉండాలి.

అప్పుడే మంచి ఫలితం కనపడుతుంది. పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు జీలకర్ర, పావుకప్పు సొంపు, ఒక కప్పు కరివేపాకు వేసి వెగించాలి. బాగా వేగాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే అధిక బరువు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. కాబట్టి ఈ పొడిని ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

