Beauty Tips

వేసవిలో ఈ నూనె రాస్తే చాలు.. చుండ్రు మాయం, జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది! ఆ ‘మ్యాజిక్’ చిట్కా ఇదే!

Hair Fall Tips In telugu ; “వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, చెమట వల్ల జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంటుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య వేధిస్తున్న వారికి ‘కలబంద మరియు కొబ్బరి నూనె’ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి.

ఈ రెండింటి మిశ్రమం జుట్టు కుదుళ్లను చల్లబరచడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు 3 రెట్లు వేగంగా పెరిగేలా చేస్తుంది. అసలు ఈ నూనెను ఎలా తయారు చేయాలి? వేసవిలో జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి…”

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టు పట్ల శ్రద్ధ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది. జుట్టు రాలే సమస్య రాగానే మనలో చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. .
hair fall tips in telugu
వాటిలో ఉండే కొన్ని కెమికల్స్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే నూనె తయారు చేసుకుని వారంలో మూడు సార్లు రాస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె తయారీ కోసం రెండు కలబంద మట్టలను తెచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
kalabanda beauty
స్టవ్ మీద పాన్ పెట్టి కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలను వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనె వేసి మరిగించాలి.. ఎక్కువసేపు మరిగించకూడదు. నూనె గ్రీన్ కలర్ లాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ నూనె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువగా మరిగించడం వలన అలోవెరా లో ఉన్న పోషకాలు అన్ని పోతాయి. కాబట్టి ఈ నూనెను ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం మంచిది. .
cococnut Oil benefits in telugu
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి అరగంట అయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు మృదువుగా పొడవుగా పెరుగుతుంది. అలోవెరా లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అధికంగా ఉంటాయి. అలాగే జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది. .
Hair Care
అలోవెరా జుట్టుకు తేమనుఅందించి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. స్కాల్ప్ మీద దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెను అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యల నుండి బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."