పార్లర్‌కు వెళ్లాల్సిన పనే లేదు! ఈ 3 వస్తువులతో 10 నిమిషాల్లో మీ ముఖం మ్యాజిక్‌లా మెరిసిపోతుంది!
Skin Whitening Pack : “సహజసిద్ధమైన మెరుపుతో మీ ముఖం ప్రకాశించాలని అనుకుంటున్నారా? ఎండ వల్ల వచ్చిన ట్యాన్ మరియు మొటిమల మచ్చలను తొలగించడానికి అరటిపండు, కాఫీ పొడి, మరియు శనగపిండి అద్భుతంగా పనిచేస్తాయి.
అరటిపండు చర్మాన్ని మృదువుగా చేస్తే, కాఫీ లోని కెఫీన్ రక్త ప్రసరణను పెంచి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అలాగే శనగపిండి చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. ఈ మూడింటితో తయారుచేసే ‘100% నేచురల్ స్కిన్ వైటనింగ్ ప్యాక్’ ఎలా వాడాలో, కేవలం 10 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలను ఎలా పొందాలో ఇక్కడ చూడండి…”
ముఖం మీద నల్లని మచ్చలు,ఓపెన్ పోర్స్, నల్లని వలయాలు,మొటిమలు ఇలా ఉండటం వలన ముఖం నిర్జీవంగా ,కాంతివిహీనంగా కనపడుతుంది. వీటిని తొలగించి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరవాలంటే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగిస్తే సరిపోతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ బాగా పండిన అరటిపండులో సగం వేసి మెత్తగా చేయాలి. అరటిపండు పేస్ట్ లో ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మూడు గంటల వరకు ముఖాన్ని సబ్బుతో కడగకూడదు.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు, ఓపెన్ పోర్స్ వంటి సమస్యలు క్రమంగా తగ్గి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని ఈ విధంగా మెరిసేలా చేసుకోవచ్చు. శనగపిండిని పూర్వ కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. చర్మం మీద మృతకణాలను తొలగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

