Beauty Tips

“తెల్ల జుట్టుకు హెన్నా రాస్తున్నారా? అయితే మీరు చేసే అతిపెద్ద పొరపాటు ఇదే..!”

మనలో చాలామంది తెల్ల జుట్టును కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం దాంతో బయటకు వెళ్లాలన్న ఇబ్బంది పడుతూ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అలాగే మరి కొంతమంది హెన్నా వంటి నాచురల్ పదార్థాలను వాడుతూ ఉంటారు. అయితే హెన్నా పెట్టే విషయంలో ఇప్పుడు చెప్పే తప్పులు చేస్తే కొన్ని సమస్యలు ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు.

హెన్నాను ఎక్కువగా వాడితే జుట్టు బాగా డామేజ్ అయ్యే అవకాశం ఉంది. హెన్నాలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది జుట్టుకు మంచి రంగులు అందిస్తుంది. కానీ ఈ టానిన్ అనేది జుట్టులోని సహజసిద్ధమైన తేమను, నూనెను పీల్చుకొని జుట్టు ఎండిపోయి గడ్డిలా పీచుల నిర్జీవంగా ఉండేలా చేస్తుంది. దాంతో జుట్టు జీవం కోల్పోయినట్టు కనబడుతుంది.

చాలామంది హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు ఒత్తుగా కనిపిస్తుందని ఆనందపడతారు. కానీ అసలు సమస్య ఏమిటంటే హెన్నా రంగు జుట్టు లోపలికి వెళ్ళదు. అది కేవలం వెంట్రుక పై భాగంలో మందపాటి పొరలాగా పేరుకుపోతుంది. తాత్కాలికంగా జుట్టు ఒత్తుగా కనిపించిన సహజసిద్ధమైన మృదుత్వాన్ని కోల్పోయి గరుకుగా ఉంటుంది.

హెన్నా జుట్టును కండిషనింగ్ చేస్తుందని మనం అనుకుంటాం. అయితే మితంగా వాడితే పరవాలేదు. కానీ ఎక్కువగా వాడటం వలన తల చర్మంపై హెన్నా పొరలు పేరుకుపోయి జుట్టు కుదుళ్లకు అవసరమైన ఆక్సిజన్, పోషణ సరిగా అందకుండా ఉంటుంది. దాంతో జుట్టు పొడిగా మారి జుట్టు కుదుళ్ళు పట్టుత్వం కోల్పోయి జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది.

ఒక్కోసారి హెన్నా లోని ప్రొటీన్స్ పడవు. దీని వలన తలపై చర్మం ఎర్రగా మారటం, విపరీతమైన దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా హెన్నా వాడటం అంత మంచిది కాదు.

చివరగా హెన్నాను పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి హెన్నా వాడితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే హెన్నాను నేరుగా వాడకుండా హెన్నాలో పెరుగు, గుడ్డులోని తెల్లసొన, కొబ్బరి నూనె వంటి వాటిని వాడితే మంచిది.

మార్కెట్లో దొరికే ఇనిస్టెంట్ హెన్నా కన్నా మనం గోరింటాకు తెచ్చుకొని ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే హెన్నా పొడిలో రసాయనాలు కలిసే అవకాశం ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."