నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, లొట్టలేసుకుంటూ తింటారు!
ఈ సీజన్లో మామిడికాయలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. సాధారణంగా మనం చింతపండు పులిహార, నువ్వు పప్పు పులిహార, నిమ్మకాయ పులిహార ఇలా చేసుకుంటూ ఉంటాం.
అయితే ఈ సీజన్లో చాలా విరివిగా లభ్యం అయ్యే మామిడికాయతో పులిహార చేసుకుంటే అంటే తాలింపు అన్నంలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ అన్నం ను బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా నిమిషంలోనే తయారు చేసేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు
కప్పున్నర బియ్యం
అర టీ స్పూన్ పసుపు
రుచికి సరిపడా ఉప్పు
అరకప్పు కొబ్బరి
5 ఎండిమిర్చి
అర స్పూను ఆవాలు
అర స్పూన్ జీలకర్ర
పచ్చి మామిడికాయ
నూనె
పచ్చిశనగపప్పు
ఎండుమిర్చి
ఇంగువ
కరివేపాకు
కొత్తిమీర
చల్ల మిరపకాయలు
ఉల్లిపాయ

తయారీ విధానం
ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కడిగిన కప్పున్నర బియ్యం, అరటి స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, మూడు కప్పుల నీటిని పోసి ఉడికించాలి.
మామిడికాయను తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 5 ఎండిమిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అవసరమైన నీటిని వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి
పొయ్యి మీద కళాయి పెట్టి ఐదు స్పూన్ల నూనె వేసి నాలుగు చల్ల మిరపకాయలు వేసి ఉపయోగించాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
అదే పాన్ లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక్క టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒకరప్ప కరివేపాకు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్త పడే వరకు వేగించాలి.
ఇవి కూడా చదవండి:
ఆ తర్వాత మిక్సీ చేసుకున్న మామిడికాయ పేస్ట్ వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా కలపాలి. ఇక చివరిగా ముందుగా వేగించిన చల్ల మిరపకాయలను చేత్తో మెత్తగా చెదిమి అన్నంలో వేసి కలిపేయాలి.
ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపితే మామిడికాయ తాలింపు రెడీ…
Source: chaipakodi.com

