Beauty Tips

జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టాలంటే.. కలబందలో వీటిని కలపండి..

Hair Fall Tips:మారిన జీవనశైలి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, జుట్టు పట్ల శ్రద్ధ పెట్టకపోవడం, కెమికల్స్ ఎక్కువ ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్ల జుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి.

ఇలా చిన్నవయసులోనే రావటం వలన కంగారు పడిపోయి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా సమస్య నుంచి బయటపడవచ్చు. అసలు ఖరీదైన షాంపూలు, నూనెలను అస్సలు వాడాల్సిన అవసరమే లేదు.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యం, అర గ్లాసు నీతిని పోసి 5 గంటల పాటు నానబెట్టి వడగట్టి ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి.

పొయ్యి మీదే ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీళ్లు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల టీ పొడి వేసి మరిగించి వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ జార్ లో కలబందను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత నాలుగు మందార పువ్వులు శుభ్రంగా కడిగి రేకలను విడదీసి వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి.

ఈ పేస్ట్ లో నాలుగు స్పూన్ల బియ్యం నీరు, నాలుగు స్పూన్ల టి డికాషన్, అర స్పూన్ ఆముదము వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి పది నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి.

ఒక అరగంట అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.

జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తల మీద చర్మం కూడా శుభ్రం అయ్యి చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."