Kitchen Tips: పాలు పల్చగా ఉన్నా సరే.. గడ్డలాంటి చిక్కటి మీగడ రావాలంటే ఇలా చేయండి!
Kitchen Tips:చాలా మంది ప్యాకెట్ పాలను వాడుతూ ఉంటారు. పాలు పలుచగా ఉండటం వలన పాల మీద మీగడ సరిగా రావడం లేదని బాధపడుతూ ఉంటారు. పాల మీద బాగా మీగడ కడితేనే వెన్న నెయ్య ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయితే పలుచని పాల నుంచి కూడా గట్టి క్రీమ్ లాంటి మీగడ తయారు చేసుకోవచ్చు.

సాధారణంగా ప్యాకెట్ పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే సరైన విధానంలో పాలను మరిగించాలి. చాలామంది పాలను మంట హై లో పెట్టి మరిగిస్తారు. అలా చేయటం వలన మీగడ సరిగా ఏర్పడదు. అలాకాకుండా పాలు ఒక పొంగు వచ్చాక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు సిమ్ లో పెట్టి మరిగించాలి
ఈ విధంగా సిమ్లో పెట్టి మరిగించడం వలన పాలల్లోని సహజ కొవ్వులు బాగా విడుదలయ్యి మీగడ ఎక్కువగా ఏర్పడుతుంది.
పాలను ఎక్కువ మంట మీద మరిగించిన తర్వాత ఒక స్పూన్ పాల పౌడర్ వేసి బాగా కలిపి ఆ తర్వాత సిమ్లో పెట్టి మరిగిస్తే.. మిల్క్ పౌడర్ వల్ల పాలల్లో కొవ్వు సాలిడ్స్ పెరిగి మీగడ గట్టిగా ఎక్కువగా వస్తుంది.. అయితే పాల రుచి కూడా మారదు.

పాలు మరిగిన తర్వాత గది ఉష్ణోగ్రత లో సహజ సిద్ధంగా పాలను చల్లార్చాలి. పాలు చల్లారే వరకు గిన్నెను కదపకుండా ఉంచాలి. చల్లారిన పాలను ఫ్రిజ్లో కొన్ని గంటలపాటు అలా ఉంచితే పాల పైన మీగడ ఒక లేయర్ లా ఏర్పడుతుంది.
పాలు పలుచగా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాని ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా నెయ్యి వెన్న వంటివి చేసేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
చూశారు కదా ఈసారి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.. మీకు గనక ఈ చిట్కాలు నచ్చితే మా వెబ్సైట్ లో ఉన్న మిగతా చిట్కాలను కూడా చూడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

