ముఖంపై మెరుపు తగ్గుతోందా? మామిడి పండు+ఓట్స్ ఫేస్ ప్యాక్స్‌తో ముఖాన్ని అందంగా చేసుకోండి..!
వేసవి కాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ శ్రద్ద పెట్టాలి. ఎందుకంటే విపరితమైన చెమట మరియు జిడ్డు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ లో దొరికే ఖరీదైన cream ల కన్నా మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
వేసవికాలంలో విరివిగా లభ్యం అయ్యే మామిడి పండుతో face ప్యాక్ గురించి తెలుసుకుందాం. వేసవి కాలం రాగానే చర్మం డల్ గా మారిపోవడం, ఎండల వల్ల ముఖంపై టాన్ (Sun Tan) పేరుకుపోవడం సర్వసాధారణం.
బయటకు వెళ్లి వస్తే చాలు.. ముఖం కాంతివిహీనంగా కనిపిస్తుంది. అయితే ఈ సమ్మర్ లో దొరికే ‘పండ్ల రాజు’ మామిడి పండుతో ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మామిడి పండు గుజ్జుకు కొద్దిగా ఓట్స్ (Oats) కలిపి ముఖానికి రాసుకుంటే.. చర్మంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు!
అసలు ఈ మ్యాంగో – ఓట్స్ ఫేస్ ప్యాక్ ఎందుకు వాడాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి మ్యాంగో – ఓట్స్ ప్యాక్ వల్ల కలిగే లాభాలు:
సన్ టాన్ మాయం: వేసవిలో ప్రధాన సమస్యలలో ఒకటైన సన్ టాన్ కి చెక్ పెడుతుంది. మామిడి పండులో ఉండే విటమిన్ ‘సి’ (Vitamin C) మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఏర్పడిన టాన్ ను వేగంగా తొలగించి, ముఖానికి సహజసిద్దమైన రంగును అందిస్తాయి.

న్యాచురల్ స్క్రబ్: ఓట్స్ (Oats) ఒక అద్భుతమైన సహజసిద్ధమైన ఎక్స్ఫోలియేటర్ (Exfoliator) లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను (Dead skin cells), మురికిని సున్నితంగా తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
మొటిమలు, మచ్చలకు చెక్: మామిడిలో ఉండే విటమిన్ ‘ఎ’ (Vitamin A) మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గించటంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇన్స్టంట్ గ్లో: ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్యాక్ వేసుకుంటే, ఓట్స్ చర్మంలోని అదనపు జిడ్డును తొలగిస్తుంది. మామిడి గుజ్జు చర్మానికి తేమను అందించి ఇన్స్టంట్ గ్లో (Instant glow) ఇస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి?
ఈ ప్యాక్ తయారీ చాలా సులభం. ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
కావలసినవి:
బాగా పండిన మామిడి పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు
ఓట్స్ పొడి (Oatmeal powder) – 1 టేబుల్ స్పూన్
పచ్చి పాలు లేదా తేనె – 1 టీస్పూన్

తయారీ విధానం:
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మామిడి పండు గుజ్జు వేయాలి. అందులో ఒక స్పూన్ ఓట్స్ పొడి వేసి బాగా కలపాలి. దానికి కొద్దిగా తేనె లేదా పచ్చి పాలు (Raw milk) జతచేసి మెత్తని పేస్ట్ లా కలుపుకోవాలి.
ఎలా వాడాలి?
ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాంగో-ఓట్స్ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేయాలి.
దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ప్యాక్ కొద్దిగా ఆరిన తర్వాత, చేతులను నీటితో తడుపుకుని ముఖంపై వృత్తాకారంలో (Circular motion) సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. చివరగా చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ ముఖం ఎప్పుడూ ఫ్రెష్ గా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ వేసవి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

