Healthhealth tips in telugu

పరగడుపున 1 స్పూన్ గుమ్మడి గింజలు తింటే… శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

ఈ మధ్య కాలంలో అందరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. తినే ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘గుమ్మడి గింజలు’ (Pumpkin Seeds) సూపర్ ఫుడ్ గా మారిపోయాయి.

ఒకప్పుడు గుమ్మడికాయ కూర వండుకున్నప్పుడు గింజలను ఎండబెట్టి తినేవారు. ఇప్పుడు ఇవి సూపర్ మార్కెట్స్, ఆన్లైన్ స్టోర్లలో విరివిగా దొరుకుతున్నాయి.

గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

వీటిని పచ్చిగా, వేయించి లేదా నీళ్లలో నానబెట్టి రోజూ ఒక స్పూన్ తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

డయాబెటిస్‌కు చెక్: గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి.

గుండె పదిలం: ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, బీపీని కంట్రోల్ లో ఉంచి గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడతాయి.

బరువు తగ్గుతారు: అధిక బరువుతో బాధపడేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కారణంగా ఇవి కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తద్వారా ఆకలి తగ్గి, సులభంగా బరువు తగ్గుతారు.
Hair Fall Tips In Telugu
జుట్టు, చర్మ సౌందర్యం: ఇందులో జింక్, ఒమేగా-3 పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ముఖంపై ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న గుమ్మడి గింజలను మీ డైలీ డైట్ లో చేర్చుకుని, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."