తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఈ సహజసిద్ధమైన ఆకుల నూనెతో జుట్టు నిగనిగలాడే నల్లగా మారడం ఖాయం!
మారిన జీవనశైలి, కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘తెల్లజుట్టు’ మరియు ‘జుట్టు రాలడం’.
జుట్టు తెల్లబడటం ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే కెమికల్ రంగులు వాడి జుట్టును మరింత పాడు చేసుకుంటుంటారు. కానీ, అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.

మన ఇంట్లోనే లభించే కొన్ని అద్భుతమైన ఆకులతో ఒక ప్రత్యేకమైన హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే, జుట్టు రాలడం తగ్గడమే కాకుండా తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
కావలసిన పదార్థాలు:
కొబ్బరి నూనె – 250 గ్రాములు
మందార ఆకులు – 10 (లేదా 5 మందార పువ్వులు)
వేప ఆకులు – గుప్పెడు
ఆముదం ఆకులు – 5
తంగేడు ఆకులు – గుప్పెడు

కలబంద గుజ్జు – అర కప్పు
గుంటగలగరాకు (భృంగరాజ్) – గుప్పెడు
ఎండిన ఉసిరి ముక్కలు – అర కప్పు
గోరింటాకు (హెన్నా ఆకులు) – గుప్పెడు
మెంతులు – రెండు స్పూన్లు
వట్టివేర్లు – తగినన్ని

నూనె తయారుచేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో 250 గ్రాముల కొబ్బరి నూనెను తీసుకోవాలి.
పైన పేర్కొన్న ఇంగ్రిడియన్స్ (ఆకులు, పువ్వులు, మెంతులు, కలబంద, ఉసిరి, వట్టివేర్లు) అన్నింటినీ ఆ నూనెలో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, చిన్న మంటపై 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

గమనిక: ఈ నూనెను ఒక్కసారి తయారు చేసుకుంటే సులభంగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు.
ఈ నూనె ఎలా పనిచేస్తుంది?
ఈ నూనెలో ఉపయోగించిన ప్రతి ఒక్క పదార్థంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.
ముఖ్యంగా తెల్లజుట్టు ప్రారంభ దశలో ఉన్నవారు ఈ నూనెను క్రమం తప్పకుండా వాడితే, జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది.

ఎలా ఉపయోగించాలి?:
ఈ సహజసిద్ధమైన నూనెను ప్రతిరోజూ జుట్టుకు రాస్తూ కుదుళ్లకు బాగా పట్టించాలి. పూర్తిగా సహజమైన వస్తువులతో ఇంట్లోనే కాస్త ఓపికగా తయారుచేసుకోవడం వల్ల దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇవి కూడా చదవండి:
మార్కెట్లో దొరికే కెమికల్ నూనెల కంటే ఇది వేల రెట్లు అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

