Healthhealth tips in telugu

బొప్పాయి గింజలను చెత్తబుట్టలో వేస్తున్నారా? వాటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

papaya seeds Benefits In Telugu :బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. కానీ, పండు తిన్నాక ఆ నల్లటి గింజలను తీసి చెత్తలో పడేస్తున్నారా? అయితే మీరు అమృతాన్ని నేలపాలు చేస్తున్నట్లే! ఆ గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఇకపై వాటిని వదలరు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి

బరువు తగ్గడం దగ్గరి నుండి కాలేయం, కిడ్నీల ఆరోగ్య రక్షణ వరకు బొప్పాయి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి చూసేందుకు చిన్నగా ఉన్నా, వీటిలో ఉండే ఔషధ గుణాలు బంగారం కంటే విలువైవి.
papaya Beauty benefits
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోజుకి 10 నుంచి 15 బొప్పాయి గింజలను పొడిగా చేసి సలాడ్లు లేదా కూరలలో జల్లుకొని తినవచ్చు. కిడ్నీ వ్యాధులను నయం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరచి బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది అంతేకాకుండా కీళ్ల నొప్పులు,మంట, నొప్పి వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.


జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారికి బాగా సహాయ పడుతుంది. బొప్పాయి గింజలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణశక్తిని మెరుగుపరచటమే కాకుండా అధిక బరువు,కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వీటిని తినటం వలన కండరాలు దృడముగా మారతాయి.

పని ఒత్తిడి కారణంగా కలిగే అలసటను తొలగిస్తుంది. చాలా మందికి బొప్పాయి గింజలను ఎలా తీసుకోవాలో తెలియదు. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని కాఫీ,టీ లలో కలుపుకొని తీసుకోవచ్చు. బొప్పాయి గింజల పొడి కాస్త చేదుగా ఉంటుంది.
gas troble home remedies

కాబట్టి బెల్లం,తేనె వంటి వాటితో కూడా తీసుకోవచ్చు. రోజుకి పావు స్పూన్ మోతాదు మించకుండా తీసుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించాలి. బొప్పాయి గింజలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని వాడి వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందండి.

వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. చిన్నపిల్లలు, పెద్దల్లో వచ్చే పేగు సంబంధిత పరాన్నజీవులు, నులిపురుగులను నాశనం చేయడంలో బొప్పాయి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

గర్భిణీ స్త్రీలు బొప్పాయి గింజలను తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."