Healthhealth tips in teluguKitchen

రోజూ తమలపాకులో కాస్త తేనె వేసుకుని తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Betel leaf And Honey Health benefits in telugu : ఆకులలో ముఖ్యమైన ఆకు తమలపాకు. ఈ ఆకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలంగా స్వీకరిస్తాం. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌ సమృద్దిగా ఉంటాయి. తేనె, తమలపాకు కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

తమలపాకు, తేనె.. ఈ రెండింటి కలయిక మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం, శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో ఈ అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఎలా సహాయపడుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజమైన ఇంటి వైద్యం మన శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుతుందో మిస్ కాకుండా చదవండి!

తేనె,తమలపాకు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. దగ్గు,జలుబు,గొంతు నొప్పి ఉన్నప్పుడు తేనె,తమలపాకు కలిపి తీసుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. ఒక తమలపాకు మీద అరస్పూన్ తేనె వేసుకొని తినవచ్చు. లేదా తమలపాకు రసంలో తేనె కలుపుకొని తాగవచ్చు.
gas troble home remedies
పిల్లల్లో అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ప్రస్తుతం వానలు వస్తున్నాయి. ఈ సమయంలో తమలపాకు,తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది.

Joint Pains
కండరాల ఒత్తిని తగ్గించటమే కాకుండా కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తమలపాకు,తేనె కలిపి తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."