Healthhealth tips in teluguKitchen

ఎముకలను ఉక్కులా మార్చే మినుములు.. వీటి ప్రయోజనాలు తెలిస్తే రోజూ తింటారు!

Black gram Health benefits in telugu : మన భారతీయ సంప్రదాయ వంటకాల్లో మినుములకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇడ్లీ, దోశ, వడ లేదా సున్నుండలు.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా మినుములు శరీరానికి అమృతం లాంటివి.

ఇందులో ఉండే అత్యధిక ప్రొటీన్లు, ఫైబర్ మన శరీరానికి ఉక్కు లాంటి బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి, మహిళలకు, మరియు ఎదుగుతున్న పిల్లలకు ఇది ఒక దివ్యౌషధం అని చెప్పవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వరకు.. మినుములు చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు.

నవ ధాన్యాలలో ఒకటైన మినుముల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది మినుములను పొట్టు తీసేసి వాడు తున్నారు. అలా కాకుండా పొట్టుతో వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మినుములలో పీచు, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1,బీ3 వంటివి పుష్కలంగా ఉంటాయి.
minumulu

అలాగే కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ-ఇన్‌ప్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

మినుముల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు కండరాల సంకోచం మరియు విడుదలను ప్రేరేపిస్తుంది.అలాగే వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపుతుంది. కాబట్టి కడుపు ఉబ్బరం,గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
మినుముల్లో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. ఐరన్ అనేది శరీరానికి అత్యంత అవసరమైన మూలకం.

ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ కణాలు అన్ని అవయవాలకు ఆక్సిజన్ తీసుకెళ్లడానికి బాధ్యతను వహిస్తాయి. శరీరంలో అవయవాలు అధిక స్థాయిలో ఆక్సిజన్ పొందినప్పుడు శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి.
Joint Pains

మినుముల్లో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, భాస్వరం మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఖనిజ సాంద్రతను ప్రభావితం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

వయస్సు పెరిగే కొద్ది ఎముకలు బలహీనం అవుతాయి. అలాగే ఆస్టియో ప్లోరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా మినుములు సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."