Healthhealth tips in telugu

ఉదయాన్నే వేడి పాలల్లో చిటికెడు ఈ పొడి కలిపి తాగితే.. షుగర్ కంట్రోల్ అవ్వడం ఖాయం!

Cinnamon blood sugar management In Telugu : మధుమేహం (Diabetes) లేదా షుగర్ వ్యాధి అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. ఒకసారి షుగర్ వస్తే జీవితాంతం మందులు వాడాలని చాలామంది భయపడుతుంటారు.

అయితే, మన వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అదే దాల్చిన చెక్క (Cinnamon).

రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడకుండా డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి.
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వారికి ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి సరిగా పనిచేయక పోవడం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది..

మారిన జీవనశైలి అలవాట్లు, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది.

దాల్చిన చెక్కను మనం ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తాం. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.
Diabetes symptoms in telugu

దీనిలో ఉండే యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలైన బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి సహాయపడతాయి.

ఇక దాల్చిన చెక్క పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ వేడి నీటిలో లేదా వేడి పాలల్లో పావు స్పూన్ లో సగం వేసి బాగా కలిపి తీసుకోవాలి. లేదా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి 4 నిమిషాల పాటు మరిగించాలి.

బాగా మరిగిన ఆ నీటిని వడకట్టి కూడా తాగవచ్చు. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు నుంచి కూడా బయట పడటానికి సహాయపడుతుంది.

దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు

Source: chaipakodi.com.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."