జూలై 1 నుంచి ఈ తప్పు చేస్తే రూ. 2,500 ఫైన్.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే!”
మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారా? అయితే ప్రయాణానికి ముందే ఈ సరికొత్త రూల్స్ తెలుసుకోవడం చాలా అవసరం. భారతీయ రైల్వే (Indian Railways) టికెట్ లేకుండా ప్రయాణించే వారికి, నిబంధనలు ఉల్లంఘించే వారికి షాక్ ఇస్తూ కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది.
‘జన్ విశ్వాస్ యాక్ట్ 2026’ కింద రైల్వే చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏదో అర్జెంట్ అని టికెట్ లేకుండా రైలు ఎక్కినా, తక్కువ ఫైన్‌తో సరిపెట్టుకునే రోజులు పోయాయి. వచ్చే నెల అంటే జూలై 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా కఠినంగా అమలు కానున్నాయి. అవేంటో ఇప్పుడే చూద్దాం!

1. వితౌట్ టికెట్ ప్రయాణిస్తే.. జరిమానా డబుల్!రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిని అడ్డుకునేందుకు, రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి టికెట్ లేకుండా లేదా తప్పుడు టికెట్‌తో పట్టుబడితే విధించే కనీస జరిమానాను రూ. 250 నుండి ఒకేసారి రూ. 500కి పెంచారు.
దీనితో పాటు ప్రయాణించిన దూరానికి అయ్యే అసలు ఛార్జీని కూడా కలిపి వసూలు చేస్తారు. ఒకవేళ ఫైన్ కట్టడానికి నిరాకరిస్తే కోర్టు ద్వారా 6 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
2. లేడీస్ కోచ్‌లోకి మగవాళ్ళు ఎక్కితే.. రూ. 2,500 ఫైన్!మహిళా ప్రయాణికుల భద్రత, కంఫర్ట్ దృష్ట్యా రైల్వే శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా లోకల్ ట్రైన్స్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మగవారు పొరపాటునో లేదా రద్దీ వల్లనో మహిళల కోచ్ (Ladies Coach) లోకి ఎక్కుతుంటారు. ఇకపై అలా చేస్తే ఏకంగా రూ. 2,500 జరిమానా విధిస్తారు. ఒకవేళ పట్టుబడిన వ్యక్తి ఫైన్ కట్టకపోతే, కోర్టుకు హాజరుపరిచి రూ. 5,000 వరకు ఫైన్ వేసేలా చట్టాన్ని సవరించారు.

ముఖ్య గమనిక: ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కినప్పటికీ, మీ వద్ద సరైన జర్నీ టికెట్ లేకపోతే కొత్త రూల్స్ ప్రకారం టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణించి రూ. 500 జరిమానా విధిస్తారు. కాబట్టి ప్రయాణానికి ముందే కన్ఫర్మ్డ్ లేదా వాలిడ్ టికెట్ ఉండేలా చూసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read: Hair Care Tips: జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగాలా? ఇంట్లోనే ఈ 3 మ్యాజికల్ హెయిర్ ప్యాక్స్
Source: chaipakodi.com

