Beauty TipsHealthhealth tips in telugu

నల్లటి, ఒత్తైన జుట్టు కోసం ఇంటి చిట్కా: మందార ఆకులు, కలోంజితో మ్యాజిక్ చూడండి!

Hair Loss Home Remedies In telugu : మారుతున్న జీవనశైలి, కాలుష్యం మరియు పోషకాహార లోపం వల్ల చాలామంది జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు వాడి విసిగిపోయిన వారికి ఈ ‘మందార – కలోంజి (నల్ల జీలకర్ర)’ మిశ్రమం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మందార ఆకులు జుట్టుకు సహజ కండిషనర్‌లా పనిచేస్తే, కలోంజి గింజలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ఒకసారి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. దాంతో మనలో చాలా మంది ఈ సమస్యలు రాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు.

అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఇంటిలో సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. 5 లేదా 6 మందార ఆకులను మరియు నాలుగు మందార పూలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
Hair fall Tips in telugu
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసుల నీటిని పోసి… నీరు వేడెక్కాక మందార ఆకులు, పువ్వులు వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల కలోంజి సీడ్స్ వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి స్ట్రైనర్‌ సాయంతో నీటిని వడగట్టాలి. ఈ నీటిని పూర్తిగా చల్లార్చాలి. .

చల్లారిన ఈ నీటిలో ఒక స్పూన్ వేప నూనె వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ నీటిని స్ప్రే చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి గంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతాయి.

మందార ఆకులు, పువ్వులలో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే కలోంజీ సీడ్స్ కూడా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఈ రెమిడీ ఫాలో అవటం వలన జుట్టు రాలే సమస్య, చుండ్రుల సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."