Healthhealth tips in telugu

99% కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను మాయం చేసే అద్భుత రహస్యం..

Joint pains Home Remedies In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ళ నొప్పులు (Knee Pains), కీళ్ల నొప్పులు (Joint Pains), నడుము మరియు కండరాల నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారం దొరకడం లేదా? అయితే, మన వంటగదిలో సహజంగా దొరికే పుదీనా (Mint) మరియు శొంఠి (Dry Ginger) తో ఈ నొప్పులకు చెక్ పెట్టవచ్చు.

ఈ ఆర్టికల్ లో మనం పుదీనా మరియు శొంఠిని ఉపయోగించి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. నొప్పులను తగ్గించటానికి పుదీనా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పుదీనా ఇప్పుడు విరివిగా లభ్యం అవుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువే.

పుదీనాను కేవలం రుచికి, వాసనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకూ,సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి కూడా సహాయ పడుతుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,విటమిన్ C,విటమిన్ D,విటమిన్ E,విటమిన్ B,క్యాల్షియం,పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి.

ఏదైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలతో పరిష్కారం చేసుకోవచ్చు.

దీని కోసం 10 పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీటిని పోసి అరగంట అలా వదిలేసి ఆ నీటిని వడకట్టి తాగాలి. నీటిని వడకట్టిన తర్వాత ఉడికిన పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో అర స్పూన్ సొంఠి పొడి, అర స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ అవ నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని.నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ తో కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసే ఉదయం ఆ. కట్టు తీసేస్తే ఒకటి రెండు రోజుల్లోనే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనాతో చెప్పిన ఈ రెండు రెమిడీలను పది రోజుల పాటు చేస్తే అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."