Healthhealth tips in telugu

7 రోజులు.. వెల్లుల్లి + తేనె: మీ శరీరంలో వచ్చే మార్పులు చూస్తే మీరే షాక్ అవుతారు!

Garlic Benefits :మీరు తరచుగా అలసిపోతున్నారా ? ఎలాంటి కారణం లేకుండా.. తీవ్రంగా నీరసించిపోతున్నారా ? ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే.. మీ వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతోందని సంకేతం. ఆరోగ్యంగా ఉండాలంటే.. స్ట్రాంగ్ ఇమ్యున్ సిస్టమ్ చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

వెల్లుల్లి, తేనె రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా.. ఏడు రోజులు తీసుకోవాలి.

ఇమ్యునిటీ
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరగడుపున తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా.. అరికడుతుంది.

కరోనరీ డిజార్డర్స్
కరోనరీ డిజార్డర్స్ అంటే.. రక్తం గడ్డకట్టడం. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి.. గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.
Honey benefits in telugu
గొంతు నొప్పి
వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.

డయేరియా
ఈ పవర్ ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్ లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

జలుబు
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్ ను ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.
garlic
ఫంగల్ ఇన్ఫెక్షన్స్
వెల్లుల్లి, తేనె రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.

డిటాక్స్
వెల్లుల్లి, తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది. హెల్తీగా ఉంచుతుంది.

మన వంటింటిలో చాలా సులభంగ్ దొరికే వెల్లుల్లి,తేనే లను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందాడని. చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి వాడటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."