Beauty TipsHealthhealth tips in telugu

ఖర్చు లేకుండా మీ వంటగదిలో ఉండే వస్తువులతోనే జుట్టు రాలడానికి చెక్ పెట్టండి!

Hair loss tips in telugu: ఖర్చు లేకుండా మీ వంటగదిలో ఉండే వస్తువులతోనే జుట్టు రాలడానికి చెక్ పెట్టండి.. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

జుట్టు రాలడానికి పోషకాహార లోపం,టెన్షన్,ఒత్తిడి వంటివి కారణాలుగా చెప్పవచ్చు. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది కంగారు పడిపోతూ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొంటు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య తగ్గడమే కాకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

జుట్టు రాలే సమస్య ఉన్న వారిలో చుండ్రు కూడా ఒక కారణం అవుతుంది. తలపై చర్మం పొడిబారినప్పుడు చుండ్రుగా మారుతుంది. అప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలుతుంది.

ఇప్పుడు మనం చెప్పుకునే రెమిడీ చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చుండ్రు వల్ల తలలో దురద కూడా ప్రారంభమవుతుంది. ఈ చిట్కాతో చుండ్రును తగ్గించడమే కాకుండా దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

అంతేకాకుండా జుట్టు రాలే సమస్యకు మంచి పరిష్కారం చూపుతుంది. దీని కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడెంట్స్ ఉపయోగిస్తాం. ఒక గిన్నెలో మూడు శీకాయలను చితక్కొట్టి గింజలు తీసి వేయాలి..ఆతరువాత 7 లేదా 8 కుంకుడు కాయలను చితక్కొట్టి గింజటు తీసి వేయాలి. ఆతరువాత 3 జామ ఆకులను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆతరువాత నీటిని పోసి పొయ్య మీద పెట్టి 7 నుంచి 8 నిమిషాల వరుకు మరిగించాలి.మరిగిన నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడూ ఆ నీటితో తల రుద్దుకోవాలి.ఈవిధంగా వారంలో రెండు సార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య క్రమం గా తాగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."