Healthhealth tips in telugu

డయాబెటిస్, కొలెస్ట్రాల్ వేధిస్తున్నాయా? ఈ గుప్పెడు గింజలతో అద్భుత ప్రయోజనాలు.

Chikkudu ginjallu benefits : చిక్కుడు కాయలను సీజన్ లో వచ్చినప్పుడు తింటూ ఉంటాం. చిక్కుడు గింజలను ఎండబెట్టి సంవత్సరం పొడవునా తినవచ్చు. ఇవి మార్కెట్ లో కూడా దొరుకుతాయి. వారంలో 4 సార్లు ఈ గింజలను ఉడికించుకొని లేదా కూర చేసుకొని తినవచ్చు. ఇలా తినటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, మాంసకృత్తులు,యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్లు (Vitamins) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా మేలును చేస్తుంది. వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలకు అంది ఎముకలు దృడంగా మారుతాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారికి బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. చిక్కుడు గింజలను రోజుకి పావు కప్పు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని తీసుకున్నప్పుడు కడుపులో ఉబ్బరంగా అనిపించే అవకాశం ఉండి. గ్యాస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."