Kitchenvantalu

చేతులకు వెల్లుల్లి వాసన వస్తుంటే.. వెంటనే ఈ టిప్స్ ట్రై చేయండి!

Garlic Smell from Your Hands:వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే మన ఆరోగ్యానికి మంచిది. సాదారణంగా వెల్లుల్లి పాయను ముట్టుకున్నామంటే చేతులకు వాసన తొందరగా పోదు.

అదే వెల్లుల్లిపాయను కోసామంటే ఆ వాసన అంత తొందరగా పోదు. అయితే ఈ ఇంటి చిట్కాల ద్వారా తొందరగా పోయేలా చేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

* వెల్లుల్లి వాసన వస్తున్న వేళ్ళను నీటి దార కింద పెట్టి స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో వేళ్ళను రుద్దాలి. ఆ తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటే వాసన పోతుంది.

* వెల్లుల్లి వాసన పోవటానికి చేతులకు కాఫీ పొడి లేదా డికాషన్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

* నిమ్మరసంలో ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంను కొంచెం అరచేతిలోకి తీసుకోని చేతులను బాగా రుద్ది కడగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."