Kitchenvantalu

అసలైన పెళ్లిళ్ల సాంబార్ రుచి రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి!

Wedding style Sambar Recipe: తెలుగు వారికి సాంబార్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అన్ని కూరలకు కాంబినేషన్ గా చేసిన, అన్నిటిని డామినేట్ చేసేస్తుంది. సరిగ్గా పెళ్లిల్లో చేసే సాంబార్ లో ఉండాలంటే, ఈ విధంగా చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు – 1/3 కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
పసుపు – 1/4టీ స్పూన్
నీళ్లు – 3 కప్పులు
చింతపండు గుజ్జు – 250ml
కారం – 1.5 టేబుల్ స్పూన్స్
సాంబార్ పొడి – 2 టీ స్పూన్స్
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2టీ స్పూన్
మెంతులు – 1/4టీ స్పూన్
ఇంగువ – 1/4టీ స్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
సాంబార్ ఉల్లిపాయలు – 20
ఫ్రెంచ్ బీన్స్ – 3
పచ్చిమిర్చి – 4
బూడిద గుమ్మడి ముక్కలు – 6 నుంచి 7
వంకాయ ముక్కలు – 4 నుంచి 5
ములక్కాడ ముక్కలు – 6 – 7
తీపిగుమ్ముడి ముక్కలు – 7 నుంచి 8
క్యారేట్ ముక్కలు – 1/4కప్పులు
క్యాప్సికమ్ ముక్కలు – 1/2కప్పు
టామాటో – 2
నీళ్లు – 600ml
ధనియాల పొడి – 1 టీ స్పూన్
బెల్లం – 1 టేబుల్ స్పూన్
dosakaya sambar
తాళింపు కోసం..
నెయ్యి – 2 టీ స్పూన్స్
ఆవాలు – 1/2టీ స్పూన్
ఎండుమిర్చి – 3
జీలకర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – చిన్న కట్ట

తయారీ విధానం
1.కుక్కర్ లోకి కందిపప్పు, పెసరపప్పు, పసుపు, నీళ్లు తీసుకుని మూత పెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఉడికిన పప్పును, పప్పు గుత్తి సాయంతో మెత్తగా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, కొద్దిగా ఆయిల్ వేసి, అందులోకి ఆవాలు, మెంతులు, వేసుకుని, కరివేపాకు, ఇంగువ వేసి, వేపుకోవాలి.
4. వేగిన ఆ తాళింపులో సాంబార్ ఉల్లిపాయలు వేసి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి.
5. ఆ తర్వాత మిగిలిన కూర గాయల ముక్కలు అన్ని వేసి మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిముషాలు వేగనివ్వాలి.
6. ఈలోపు ఒక గిన్నేలోకి చింతపండు గుజ్జు, కారం, సాంబార్ పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

7. మగ్గిన కూరగాయల ముక్కల్లో చింతపండు పులుసు పోసి, ఉడికించుకోవాలి.
8. పులుసు మరుగుతున్న సమయంలో మెత్తగా చేసిపెట్టుకున్న పప్పు, 200 ml నీళ్లు, కలిపి, మూత పెట్టి, 15 నిముషాల పాటు మరిగించాలి.
9. మరుగుతున్న సమయంలో బెల్లం వేసి మరో 5 నిముషాలు మరిగించాలి.
10. ఇప్పుడు తాలింపు కోసం, కడాయి పెట్టుకుని, నెయ్యిని కరిగించి, అందులోకి తాళింపులు వేసి, వేగాక, సాంబార్ లో కలుపుకుని చివరగా కొత్తిమీర తరుగు వేసి 3 నిముషాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."