వంకాయ పప్పు ఇగురు ఇలా చేస్తే.. ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు!
Vankaya Pappu Iguru:వంకాయ పప్పు ఇగురు ఇలా చేస్తే.. ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు.. పప్పు, టమాటో,పప్పు ,ఆకు కూరల కాంబినేషన్స్ ఎక్కువగా చేస్తుంటాం. కాని వంకాయ తో కందిపప్పు ఇగురు చాలా రుచిగా ఉంటుంది.ఈ సారి ట్రై చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – ½ kg
చింతపండు నీళ్లు ½ కప్పు
పచ్చిమిర్చి – 6-7
పచ్చికొబ్బరి – ½ కప్పు

నూనె – 2 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
కంది పప్పు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
నీళ్లు – 400 ml
పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
☛ Also Read: Vijayawada:విజయవాడ ఫుడ్ అనగానే గుర్తొచ్చే టాప్ 5 ఐటెమ్స్.. భోజనప్రియులు అస్సలు మిస్ అవ్వకండి!
తయారీ విధానం
1.వంకాయలను పొడవుగా కట్ చేసుకోని నీళ్లల్లో వేసుకోవాలి.
2.వంకాయ ముక్కలకు చింతపండు రసం యాడ్ చేసుకోని ఎనబై శాతం ఉడకబెట్టుకోవాలి.
3.మెత్తగా ఉడికిన వంకాయ ముక్కలను వడకట్టి చల్లారనివ్వాలి.
4.మిక్సిలో పచ్చిమిర్చి కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
☛ Also Read: పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరో తెలుసా? ఈ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5.నూనె వేడి చేసి అందులో ఆవాలు ,మినపప్పు,శనగ పప్పు ,కరివేపాకు వేసి ఎర్రగా వేపుకోవాలి.
6.వేగిన తాలింపులో ఉడికంచుకున్న వంకాయ ముక్కలు ,నానబెట్టుకున్న కందిపప్పు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి.
7.మూడు నిమిషాల తర్వత పచ్చిమిర్చి ,కొబ్బరి పేస్ట్,ఉప్పు వేసి కలిపి కందిపప్పు మెత్త పడే వరకు ఉడికించాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే..
☛ Also Read: పరగడుపున అన్నం తినే అలవాటు ఉందా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే!

