Kitchenvantalu

స్ట్రీట్ స్టైల్ ఎగ్ రోల్స్ ఇంట్లోనే చాలా ఈజీగా.. పిల్లలు భలే ఇష్టంగా తింటారు!

Egg Rolls:ఎగ్ రోల్స్..పిల్లల కోసం వెరైటీ స్నాక్స్ తయారు చేయాలనకుంటే ఎగ్ రోల్స్ చేసి చూడండి. టేస్ట్ తో పాటుగా పోషకాలు కూడ అందుతాయి.బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ లోకి ఈ రోల్స్ చేసి పెట్టారంటే మిగిల్చకుండా తినేస్తారు.

ఎంతో రుచికరమైన, వేడి వేడి ‘స్ట్రీట్ స్టైల్ ఎగ్ రోల్స్’ (Street Style Egg Rolls) ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట బండి మీద దొరికే అదే టేస్ట్‌తో, మరింత శుభ్రంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.

పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్‌గా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్‌కి కూడా బెస్ట్ ఆప్షన్. ఒక్క రోల్ తిన్నా చాలు.. కడుపు నిండిపోతుంది!

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
గుడ్లు – 2
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 3
క్యారెట్ మొక్కలు – ½ కప్పు
క్యాబేజీ – ½ కప్పు
క్యాప్సికం – ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా చపాతిల కోసం గిన్నెలోకి గోధుమ పిండిలోకి చిటికెడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి.
2.కలుపుకున్న పిండిని పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు మగ్గాక క్యారేట్ ,క్యాప్సికం ముక్కలను వేసి ఉడికించుకోవాలి.
5.ఉప్పు,మిరియాల పొడి వేసి కూరగాయలు మెత్తపడే వరకు వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

6.ఇప్పుడు వేరొక గిన్నెలో గుడ్లను కొట్టి అందులోకి చిటికెడు ఉప్పు,మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి.
7.ఇప్పుడు చపాతిలు చేసుకోని వేడిచేసిన ప్యాన్ పై వేసుకోవాలి.
8.చపాతి కాస్తా వేగానివ్వాలి.
9. గుడ్డు మిశ్రమాన్ని వేరొక ప్యాన్ లో వేసి స్ప్రెడ్ చేసుకోని దాని పై వెజిటెబుల్ స్టఫింగ్ వేసి పైనా చపాతిని వేసుకోవాలి.
10.ఒక నిమిషం పాటు వేగాక చపాతిని తిప్పుకోని రోల్ చేసుకోవాలి.
11.అంతే ఎగ్ రోల్స్ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."