Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 15 రోజుల్లో మ్యాజిక్.. ఒక్క స్పూన్ నూనెతో జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది!

Hair fall oil :కేవలం 15 రోజుల్లో మ్యాజిక్.. ఒక్క స్పూన్ నూనెతో జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది.. వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉన్న నూనెలు, షాంపూలు వాడటం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయిపోయింది.

వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనపడుతుంది.జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీని కోసం కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె ఏదైనా వాడవచ్చు.

ఒక గిన్నె పెట్టి దానిలో 100 గ్రాముల కొబ్బరి నూనె వేసి దానిలో రెండు మందార పువ్వులను కింద తొడిమలు,పుప్పొడి కాడలను తీసేసి వెయ్యాలి. నూనెలో మందార పూలు బాగా వేగే వరకూ మరిగించాలి. మందార పువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక నూనెను వడగట్టాలి.

ఈ నూనెను మనం నార్మల్ గా రాసుకొనే నూనెకు బదులుగా ప్రతి రోజు రాసుకుంటూ ఉండాలి.ఈ విధంగా ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే తలలో కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు వేగంగా పెరుగుతుంది.

అంతేకాకుండా తల మీద చర్మం మీద తగినంత తేమ ఉండి చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పాలి. మందార పువ్వులను పురాతన కాలం నుండి జుట్టు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు.

అంతే కాకుండా ఈ నూనెను రెగ్యులర్ గా రాసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. ఈ నూనె కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

ఈ చిట్కాలో వాడిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."