Kitchenvantalu

పప్పుదినుసులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలా? అయితే ఈ కిచెన్ టిప్స్ మీకోసమే!

Storage of Rice and pulses:ఇంట్లో పప్పుధాన్యాలను ఎక్కువ రోజులు నిల్వ చేసినప్పుడు పురుగు పట్టడం చాలామంది ఎదుర్కొనే సమస్యే. అయితే కొన్ని చిన్న చిన్న వంటింటి చిట్కాలు పాటించడం ద్వారా పప్పులను నెలల తరబడి పాడవకుండా, ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

పప్పుదినుసులకు పురుగు పట్టకుండా కాపాడే బెస్ట్ కిచెన్ హ్యాక్స్ మరియు వాటిని సురక్షితంగా నిల్వ చేసే పద్ధతులు ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.

మనం ఒక్కోసారి బియ్యం,పప్పులు వంటి వాటిని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వానా కాలంలో కూడా పప్పులు,బియ్యం వంటి వాటికీ చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

పప్పులు,బియ్యం పోసే డబ్బాలో ఎండిన వేపాకులను వేస్తే పురుగు తొందరగా పట్టదు. అలాగే వెల్లుల్లి కూడా పురుగు పట్టకుండా నిరోదిస్తుంది. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేయాలి. ఈ రెండు చిట్కాలు బియ్యం,పప్పులు పురుగు పట్టకుండా చేస్తాయి. వేపాకులు,వెల్లుల్లి రెబ్బలను వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి.

అలాగే పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి. పప్పులు స్టోర్‌ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్‌ బ్యాగ్‌ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."