Beauty TipsHealthhealth tips in telugu

వారానికి ఒక్కసారి ఇది వాడితే చాలు… మీ ముఖం మచ్చలు లేకుండా మెరిసిపోతుంది!

Winter Face Pack In Telugu : ముఖంపై మచ్చలు తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చే బెస్ట్ ఫేస్ గ్లో టిప్స్ (Best Face Glow Tips in Telugu). వారానికి ఒక్కసారి వాడితే డార్క్ స్పాట్స్ తగ్గి గ్లోయింగ్ స్కిన్ (Glowing Skin Naturally) మీ సొంతం అయ్యే అద్భుతమైన హోమ్ రెమెడీ, మరియు దాన్ని ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ద పెడుతున్నారు. అయితే అందం కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్ళనవసరం లేదు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖం మీద మచ్చలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఈ రెమిడీని చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక vitamin e capsule లోని ఆయిల్, అరస్పూన్ రోజ్ వాటర్ పోసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది.

కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున చర్మ సమస్యలను సహజంగా నయం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. రోజ్ వాటర్ మంచి స్కిన్ టోనరగా పనిచేస్తుంది.

ముఖం మీద పేరుకుపోయిన మురికీ, దుమ్ము,ధూళి,నూనె, జిడ్డు లాంటి వాటిని కూడా రోజ్ వాటర్ తొలగిస్తుంది. విటమిన్ E ఆయిల్ చర్మం ముడతలు పడకుండా చేయడంలో, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో సహాయపడుతుంది. పొడి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."