Beauty TipsHealthhealth tips in telugu

కలబందతో ఈ గింజలు కలిపి రాయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు, ఒత్తైన జుట్టు మీ సొంతం!

Alovera And kalonji seeds Hair Loss Tips : విపరీతంగా జుట్టు రాలిపోతుందా? కలబందలో ఈ ప్రత్యేక గింజలను కలిపి జుట్టుకి పట్టిస్తే హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గి, కుదుళ్ల నుండి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టు పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య తీవ్రం అయిపోతుంది.

సమస్య రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ చిట్కా కోసం కలబందను ఉపయోగిస్తున్నాం.కలబంద ముక్కను తీసుకొని వాటి యొక్క ముళ్ళు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అరకప్పు తీసుకోవాలి. మిక్సీ జార్ లో కలబంద ముక్కలు, గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా దృఢంగా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ డ్రై లేదా ఆయిల్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు.

కలబంద జుట్టు సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇందులో అధిక తేమ ఉండుట వలన జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కలబందలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పొడవుగా ,దృఢంగా ఉండేలా చేస్తాయి.

కలోంజి గింజలు జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. అలాగే జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి సమయాన్ని కేటాయిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."