డీమార్ట్‌తో డైరెక్ట్ బిజినెస్.. మీ ప్రొడక్ట్స్ అమ్మి నెలనెలా లక్షలు సంపాదించే సూపర్ ఛాన్స్!
డీమార్ట్ (DMart)… సామాన్యుల పాలిట కల్పతరువు. నెలకు సరిపడా సరుకులు తక్కువ ధరకే దొరకడంతో నిత్యం కస్టమర్లతో కిటకిటలాడుతుంటుంది. అయితే, డీమార్ట్‌లో వస్తువులు కొనడమే కాదు, మీ సొంత ఉత్పత్తులను అక్కడ అమ్మి లక్షల్లో లాభాలు కూడా గడించవచ్చన్న సీక్రెట్ మీకు తెలుసా?
అవును, మీరు డీమార్ట్‌కు సప్లయర్‌గా మారి మీ బిజినెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లొచ్చు. డీమార్ట్ తో బిజినెస్ ఎలా చేయాలి? కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్ల వివరాలు మీకోసం.
అసలు అవకాశం ఏంటి?
ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి.. డీమార్ట్ ఎవరికీ స్టోర్ ఫ్రాంచైజీలు ఇవ్వదు. కానీ, మీ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంటే దాన్ని డీమార్ట్‌కు సప్లై చేసే వెండార్ (Vendor) లేదా సప్లయర్‌గా మారవచ్చు.

డీమార్ట్‌లో మీ వస్తువులు పెట్టాలంటే ఏ అర్హతలు ఉండాలి?
డీమార్ట్ లాంటి దిగ్గజ కంపెనీ మీ ప్రొడక్ట్‌ను తీసుకోవాలంటే ఈ 4 విషయాల్లో మీరు బెస్ట్ అయి ఉండాలి:
✅ క్వాలిటీ (Quality): నాణ్యతలో అస్సలు రాజీ పడకూడదు. కస్టమర్లకు నచ్చేలా అత్యుత్తమంగా ఉండాలి.
✅ ధర (Price): బయటి మార్కెట్ కంటే మీ వస్తువుల ధర కాస్త తక్కువకే ఇవ్వగలగాలి. తక్కువ ధరకు మంచి క్వాలిటీ ఇవ్వడమే డీమార్ట్ సక్సెస్ సీక్రెట్.
✅ ప్యాకింగ్ (Packaging): మీ ప్రొడక్ట్ చూడగానే ఆకర్షించేలా, డీమార్ట్ ర్యాక్స్‌లో పెట్టడానికి అనువుగా నీట్‌గా ప్యాక్ చేయాలి.
✅ నిరంతర సరఫరా (Supply): డీమార్ట్‌కు లక్షల్లో కస్టమర్లు ఉంటారు. వారు అడిగిన వెంటనే, కొరత లేకుండా సరుకు పంపే కెపాసిటీ మీకు ఉండాలి.
కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు
బిజినెస్ అన్నాక లీగల్ డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి.
వ్యాపారానికి సంబంధించిన GST, PAN నంబర్లు తప్పనిసరి.
మీరు అమ్మేది ఫుడ్ ఐటమ్స్ అయితే FSSAI లైసెన్స్ కచ్చితంగా ఉండాలి.
ఇతర వస్తువులైతే BIS వంటి ప్రభుత్వ సర్టిఫికెట్లు అవసరం అవుతాయి.
పెట్టుబడి & లాభాలు ఎంత ఉంటాయి?
సప్లయర్‌గా మారడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్/ఫ్రాంచైజీ ఫీజు ఉండదు. కానీ.. ప్రొడక్ట్ తయారీ, ప్యాకింగ్, రవాణాకు మీ దగ్గర తగినంత డబ్బు (Working Capital) ఉండాలి.
డీమార్ట్ సాధారణంగా సరుకు తీసుకున్న 30 నుంచి 60 రోజుల్లోపు పేమెంట్ చేస్తుంది. ఈ గ్యాప్‌ను తట్టుకునేలా మీ దగ్గర బ్యాకప్ అమౌంట్ ఉండాలి. ఇక లాభాలంటారా? అది మీ వస్తువుకున్న డిమాండ్‌ను బట్టి నెలనెలా లక్షల్లోనే ఉంటుంది!
అప్లై చేసే విధానం – సింపుల్ స్టెప్స్
ఆన్లైన్ అప్లికేషన్: నేరుగా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. డీమార్ట్ అఫీషియల్ వెబ్సైట్ (Avenue Supermarts Ltd) లోకి వెళ్లి ‘Vendor Registration’ ఫామ్ నింపి అప్లై చేయాలి.
MSME రిజిస్ట్రేషన్: మీకు కేంద్ర ప్రభుత్వ Udyam / MSME సర్టిఫికెట్ ఉంటే డీమార్ట్ మొదటి ప్రాధాన్యం ఇస్తుంది.
బార్కోడ్ (Barcode): మీ ప్రతి వస్తువుపై తప్పనిసరిగా GS1 బార్కోడ్ ప్రింట్ చేసి ఉండాలి.
రిటర్న్ పాలసీ: అమ్ముడుపోని వస్తువులను వెనక్కి తీసుకునే (Return to Vendor) నిబంధనకు మీరు ముందుగానే అంగీకరించాలి.
మీ దగ్గర దమ్మున్న ప్రొడక్ట్ ఉండి, క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే డీమార్ట్‌లో మీ బ్రాండ్‌కు కచ్చితంగా చోటు దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

